Gossipsఅక్కినేని వారసుడు కోసం రంగంలోకి దిగ్గిన మెగాస్టార్..కధ టోటల్ రివర్స్..?

అక్కినేని వారసుడు కోసం రంగంలోకి దిగ్గిన మెగాస్టార్..కధ టోటల్ రివర్స్..?

అక్కినేని అందగాడు అఖిల్.. నాగార్జున కొడుకుగా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ, ఈ అఖిల్ అందగాడికి ఇంతవరకు ఒక్క హిట్టు కూడా పడకపోవడం గమనార్హం. ఎప్పుడు రొటీన్ కు భిన్నంగా కథలను ఎంపిక చేసుకొని హిట్ కొట్టే నాగార్జునకు ఆయన కొడుకులను మాత్రం ఇండస్ట్రీలో నిలబెట్టలేకపోతున్నారు. అఖిల్ మొదటి మూవీనే పెద్ద డిజాస్టర్ అయ్యింది.

వరసగా మూడు పరాజయాల తర్వాత బాక్సాపీస్ పైకి మరోసారి దండయాత్రకు వస్తున్నాడు అఖిల్ అక్కినేని. ఈయన తాజాగా నటిస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్2 బ్యానర్ పై బన్నీ వాస్ – వాసు వర్మ కలిసి నిర్మిస్తున్నారు. ఈ రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

గోపీ సుందర్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మరియు టీజర్ ఆకట్టుకున్నాయి ఈ సినిమాపై ముందు నుంచి కూడా ఆసక్తి బాగానే ఉంది. వరస ఫ్లాపుల్లో ఉన్న బొమ్మరిల్లు భాస్కర్ ను నమ్మి నాగార్జున, అల్లు అరవింద్ ప్రాజెక్ట్ ఇచ్చారంటే సినిమాలో ఎంత దమ్ము ఉందో అని అక్కినేని ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నారు.

అక్కినేని అఖిల్ ఇపుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ సినిమాతో పలకరించబోతున్నాడు. ఈ సినిమాలో అఖిల్ జేమ్స్ బాండ్ తరహా స్పై క్యారెక్టర్‌లో కనిపించున్నాడు అవును అఖిల్.. హీరోగా నటిస్తోన్న 5వ సినిమాలో అఖిల్ జేమ్స్ బాండ్ తరహా స్పై క్యారెక్టర్‌లో కనిపించున్నాడు. ఈసినిమాకి ‘ఏజెంట్’ అనే పేరు ఖరారు చేసారు. ఈ చిత్రంలో అఖిల్ ఎంతో స్టైలిష్‌గా రఫ్‌గా ఉంది. ఒక ఏజెంట్ అంటే ఇలాగనే ఉంటాడు అనే తరహాలో ఉంది. ఈ సినిమాను ఏ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు 40 కోట్ల బడ్జెట్‌ను కెటాయించారని సమాచారం.

ఈ సినిమాలో మళయాళ మెగాస్టార్ మమ్ముటి కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా కోసం మమ్ముటి ఏకంగా 3కోట్లు రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు సిని ఇండస్ట్రీలు గుసగుసలు వినిపిస్తున్నాయి. మమ్ముట్టి గతంలో తెలుగు సినిమాలు సూర్య ది గ్రేట్, లాయర్ ది గ్రేట్, దళపతి (తమిళ అనువాదం), స్వాతి కిరణం, యాత్ర వంటి సినిమాల్లో నటించారు. ఇపుడు మరోసారి అఖిల్ సినిమాలో పవర్‌ఫుల్ పాత్రలో నటించబోతున్నట్టు టాలీవుడ్ ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంలో అఖిల్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించబోతున్నట్టు సమాచారం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news