Moviesశృతిమించిన ఆది వల్గర్ కామెడీ.. చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చిన యాంకర్..!!

శృతిమించిన ఆది వల్గర్ కామెడీ.. చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చిన యాంకర్..!!

హైపర్‌ ఆది..ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులు లేరు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. జబర్ధస్త్ అనే షో ద్వారా ప్రపంచానికి పరిచయమైన ఆది తనదైన శైలిలో కామెడీ పండిస్తూ హైపర్‌ ఆదిగా గుర్తింపు తెచ్చుకున్నాడు… చాలా తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో పాపులర్ అయిపోయాడు. తనదైన కామెడీ టైమింగ్‌, పంచు డైలాగులతో షోని రక్తి కట్టిస్తాడు. అదే సమయంలో వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఎదుటి వారిపై పంచులు వేస్తూ బుల్లితెర ప్రేక్షకులకు ఎనలేని కామెడీని అందిస్తుంటాడు.

ఇక ఏ షో చేసిన అందులో ఆడవాళ్లు, మహిళ యాంకర్స్‌పై అతడు వేసే డబల్‌ మీనింగ్‌ పంచ్‌లు మాములుగా ఉండవు. ఎంతటి వారినైనా అవి ఆకట్టుకుంటాయి. అయితే ఒక్కోసారి శృతి మించే పంచ్‌లు నవ్వు తెప్పించకపోగా ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తాయి. తాజాగా హైపర్‌ ఆది మరోసారి తన డబుల్‌ మీనింగ్‌ డైలాగులతో యాంకర్‌పై రెచ్చిపోయాడు. జబర్ధస్త్ షోలో పాల్గొన్న హైపర్‌ ఆది..యాంకర్‌ అనసూయ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ అవుతున్నాయి.

తాజాగా వచ్చే వారం జూలై 8 జబర్దస్త్ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా.. ఆది, అనసూయతో కలిసి రెచ్చిపోయాడు. జబర్ధస్త్‌లో హైపర్ ఆది ఎవరో ఒకరిని గెస్టుగా తీసుకు రావడం పరిపాటి అయిపోయింది. ఇక ఈవారం అనసూయతో పాటు రోహిణి, ఢీ డాన్సర్ ఈ ముగ్గురు ముద్దుగుమ్మలతో స్కిట్ చేశాడు. ఈ క్రమంలోనే వాళ్లతో పాటు ఈ యాంకర్ మీద కూడా రొమాంటిక్‌గా పంచులు వేస్తూ నవ్వించే ప్రయత్నం చేశాడు.

ప్రోమోలో.. ఆ సమయంలో ‘ఉదయం నీతో బ్రేక్‌ఫాస్ట్ చేస్తా.. మధ్యాహ్నం నీతో లంచ్ చేస్తా’ అన్నాడు ఆది. అప్పుడు అనసూయ వైపు చూస్తూ సాయంత్రం నీతో అనబోయే సరికి ఆమె చంపేస్తా అంది. దీనికి ‘అందుకే మీతో ఏం చేయట్లా’ అంటూ ఆది బదులిచ్చాడు. మళ్లీ ఓ సందర్భంలో.. నువ్ మంచం రెడీ చేసి పెట్టు అని అనసూయకు మరో పంచ్ ఇచ్చాడు ఆది. అలాగే, డ్యాన్సర్ తేజస్వినితో ‘నువ్వు మల్లెపూలు రెడీగా పెట్టు’ అన్నాడు.

అప్పుడు పక్కనే ఉన్న రోహిణి మరి నేనేం చేయాలని అడిగింది.దీనికి హైపర్ ఆది ‘నువ్వు బయటకు వెళ్లి తలుపుకు గొళ్లెం పెట్టు’ అంటూ పంచ్ వేశాడు. దీంతో అందరూ పగలబడి నవ్వుకున్నారు. ఇక మనోడి ద్వందార్థాలతో కూడిన డైలాగ్‌లలో అసలు అర్థాన్ని గ్రహించిన రోజా మొహానికి అడ్డంగా చేయి పెట్టుకుని ఎప్పటిలాగే పకా పకా నవ్వగా.. స్టేజ్ మీద ఉన్న అనసూయ కూడా ఆది పంచ్‌లను తెగ ఎంజాయ్ చేసింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news