Moviesసౌంద‌ర్య బ‌యోపిక్‌లో ఆ క్రేజీ హీరోయిన్ ఫిక్స్‌..!

సౌంద‌ర్య బ‌యోపిక్‌లో ఆ క్రేజీ హీరోయిన్ ఫిక్స్‌..!

ద‌క్షిణ సినీ ప‌రిశ్ర‌మ‌లో దివంగత క‌న్న‌డ క‌స్తూరి సౌంద‌ర్య తిర‌గులేని క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ళ‌యాళ్ ఇలా ఏ భాష‌లో అయినా అంద‌రు స్టార్ హీరోల‌తో ఆమె న‌టించి సూప‌ర్ డూప‌ర్ హిట్లు సొంతం చేసుకుంది. అమితాబ్‌తో కూడా ఆమె ఆడిపాడింది. చాలా త‌క్కువ వ‌య‌స్సులోనే తిరుగులేని స్టార్ డ‌మ్ సొంతం చేసుకున్న ఆమె త‌న మేన‌బావ‌నే పెళ్లాడింది. అయితే 2004 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆమె బీజేపీ ఎంపీగా పోటీ చేసిన విద్యాసాగ‌ర్ రావు ఎన్నిక‌ల ప్రచారానికి వెళుతూ హెలీకాఫ్ట‌ర్ కూలిపోవ‌డంతో చిన్న వ‌య‌స్సులోనే తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోయారు.

 

ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో అంతా బ‌యోపిక్‌ల హ‌వా న‌డుస్తోంది. దీంతో సౌంద‌ర్య బ‌యోపిక్ కూడా తెర‌మీద‌కు వ‌చ్చింది. సౌంద‌ర్య బ‌యోపిక్ తెర‌కెక్కించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ప్ర‌ముఖ మ‌ళ‌యాళీ సంస్థ ఈ బ‌యోపిక్‌ను అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇక ఈ బ‌య‌పిక్‌లో సౌంద‌ర్య పాత్ర పోషించే విష‌యంలో కూడా క్లారిటీ వ‌చ్చిందంటున్నారు.

 

ముందుగా కీర్తి సురేష్‌ను సంప్ర‌దించ‌గా… ఆమె సుముఖంగా లేక‌పోవ‌డంతో ఇప్పుడు ఆ ప్లేస్‌లో సాయి ప‌ల్ల‌విని ఒప్పించి ఫైన‌లైజ్ చేశారంటున్నారు. ఏదేమైనా మంచి న‌టి అయిన సాయి ప‌ల్ల‌వి సౌంద‌ర్య‌గా ఏ రేంజ్‌లో మెప్పిస్తుందో ?  చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news