Moviesముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ భార్య పాత్ర‌లో ఆ క్రేజీ హీరోయిన్‌

ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ భార్య పాత్ర‌లో ఆ క్రేజీ హీరోయిన్‌

శ్రీలంక లెజెండ్రీ ఆఫ్ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్ బ‌యోపిక్ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్ సేతుప‌తి హీరోగా న‌టించ‌నున్న ఈ బ‌యోపిక్‌ 800 కు ఎమ్మెస్ శ్రీప‌తి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. టెస్టుల్లో 800 వికెట్లు తీసిన ముర‌ళీ ధ‌ర‌న్ రికార్డుకు చేరువ‌లో కూడా ఎవ్వ‌రూ లేరు. ఇక ముర‌ళీ ధ‌ర‌న్ శ్రీలంకకు చెందిన క్రికెట‌ర్ అయినా కూడా అత‌డు చెన్నై అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు.

 

 

ఈ సినిమాను నిర్మాణ సంస్థ మూవీ ట్రైన్‌ మోషన్‌ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇక ముర‌ళీ ధ‌ర‌న్‌గా విజ‌య్ సేతుప‌తి ప‌క్క‌న భార్య‌గా మధిమలర్‌ పాత్రలో రజిష విజయన్‌ నటించనున్నారు. కొన్ని మలయాళ సినిమాల్లో మ‌ధిమ‌ల‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఆమె కోలీవుడ్ హీరో ధ‌నుష్ ప‌క్క‌న కూడా ఓ సినిమాలో న‌టిస్తోంది. మంగ‌ళ‌వారం ఈ సినిమాను పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభిస్తారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news