ఈ రోజు కూడా జ‌గ‌న్ విచార‌ణ‌కు డుమ్మాయే…

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆస్తుల కేసులో నేడు సీబీఐ కోర్టులో విచార‌ణ జ‌ర‌గ‌నుంది. గ‌త విచార‌ణ‌లో ఇప్పుడు సీఎం కోర్టుకు హాజ‌రు అయ్యే ప‌రిస్థితి లేనందున వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా విచార‌ణ చేయాల‌ని సీఎం జ‌గ‌న్ త‌ర‌పున న్యాయ‌వాది కోరారు. దీంతో ఈ రోజు కేసును వీడియో ద్వారా విచారించ‌నున్నారు. మొత్తం జ‌గ‌న్ విష‌యంలో నాలుగు కేసుల‌పై స్టే ఉండ‌డంతో సీబీఐ న్యాయ‌స్థానం దూకుడు పెంచింది.

 

హెట్రో, అర‌బిందో సంస్థ‌ల‌కు భూ కేటాయింపులు, జ‌గ‌తి ప‌బ్లికేష‌న్స్‌లో పెట్టుబ‌డులు ఇత‌ర సంస్థ‌ల‌కు భూములు లీజుకు ఇచ్చిన కేసుల‌పై కూడా విచార‌ణ జ‌రుగుతోంది. ఇక అర‌బందో, హెట్రో సంస్థ‌ల‌కు క్విడ్ ప్రొ కోపై ఈడీ కేసు నమోదు చేసిన నేప‌థ్యంలో నేడు విచార‌ణ జ‌ర‌గ‌నుంది. అయితే జ‌గ‌న్ ఈ రోజు కూడా విచార‌ణ‌కు హాజ‌రు కావ‌డం లేద‌ని స‌మాచారం.