Moviesర‌ష్మీపై నీ అభిప్రాయం చెప్ప‌మ‌న్న రోజా... సిగ్గుతో సుధీర్ ఏం చేశాడంటే..

ర‌ష్మీపై నీ అభిప్రాయం చెప్ప‌మ‌న్న రోజా… సిగ్గుతో సుధీర్ ఏం చేశాడంటే..

ఈటీవీలో ప్ర‌సారం అవుతోన్న కామెడీ షో ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ షో తాజాగా 300వ ఎపిసోడ్‌లోకి అడుగు పెట్టింది. దీంతో సెట్ పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొన‌డంతో పాటు సెల‌బ్రేష‌న్స్ నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలోనే జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోలోని క‌మెడియ‌న్ల గురించి రాకేష్ స్కిట్ చేసి అంద‌రిని న‌వ్వించాడు. ఇందుకోసం రాకేష్ పేద‌రాశి పెద్ద‌మ్మ గెట‌ప్‌లో క‌నిపించాడు. ఇదిలా ఉంటే ఓ స్కిట్‌లో ర‌వి, అన‌సూయ‌తో పాటు టిక్‌టాక్ దుర్గారావు దంప‌తులు కూడా త‌ళుక్కున మెరిశారు.

 

సెల‌బ్రేష‌న్స్‌లో భాగంగా రోజా ర‌ష్మిపై నీకున్న అభిప్రాయం అభిమానుల కోసం చెప్ప‌మ‌న్న ప్ర‌శ్న‌తో షాక్ ఇచ్చింది. రోజా అడిగిన ఈ ప్ర‌శ్న‌తో ర‌ష్మి – సుధీర్ ఒక్క‌సారిగా సిగ్గుప‌డ్డారు. అనంత‌రం సుధీర్ మాట్లాడుతూ సుధీర్ అంటే కొంత‌మంది మాత్ర‌మే గుర్తు ప‌డ‌తార‌ని.. అయితే ర‌ష్మీ – సుధీర్ అంటే మాత్రం మొత్తం అంద‌రూ గుర్తు ప‌డ‌తార‌ని చెప్పాడు.

 

ప్ర‌తి మ‌గవాడి విజ‌యం వెన‌క ఓ మ‌హిళ ఉంద‌ని అంటారు.. అయితే ఎనిమిది సంవ‌త్స‌రాలుగా నా విజ‌యం వెన‌క కాదు కాదు నా ప‌క్క‌నే ( ర‌ష్మిని ఉద్దేశించి ) ఉంది అని చెప్పాడు.  సుధీర్ చెపుతోన్న మాట‌ల‌కు ప‌క్క‌నే ఉన్న ర‌ష్మి కూడా త‌బ్బిఉబ్బ‌య్యింది. ఏదేమైనా ర‌ష్మీ – సుధీర్ ఎప్పుడూ బుల్లితెర‌పైనే కాదు సోష‌ల్ మీడియాలోనూ ట్రెండ్ అవుతుంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news