Moviesబ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్‌కే నో చెప్పి షాక్ ఇచ్చిన రామ్‌చ‌ర‌ణ్‌..!

బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్‌కే నో చెప్పి షాక్ ఇచ్చిన రామ్‌చ‌ర‌ణ్‌..!

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు తాను నిర్మాత‌గా త‌న తండ్రి చిరు హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఆచార్య సినిమాలోనూ న‌టిస్తున్నాడు. ఆచార్య‌లో చ‌ర‌ణ్ ఓ కేమియో రోల్ చేస్తున్నాడ‌ట‌. ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాలు చాలా వ‌ర‌కు కంప్లీట్ అవ్వ‌డంతో చర‌ణ్ త‌న నెక్ట్స్ సినిమాలు లైన్లో పెట్టేందుకు వ‌రుస‌గా క‌థ‌లు వింటున్నాడ‌ట‌.

 

ఈ క్ర‌మంలోనే ఛ‌లో, భీష్మ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సినిమాల‌తో మంచి స్వింగ్‌లో ఉన్న వెంకీ కుడుముల కూడా చ‌ర‌ణ్‌కు ఓ క‌థ చెప్పాడ‌ట‌. చ‌ర‌ణ్‌ణు దృష్టిలో పెట్టుకుని వెంకీ రెడీ చేసిన క‌థ విన్న చ‌ర‌ణ్ ఆ క‌థ నాకు సూట్ కాద‌ని.. నేను చేయ‌లేన‌ని చెప్పేశాడ‌ట‌. ఏదేమైనా ప్ర‌స్తుతం వెంకీ కుడుముల‌తో చేసేందుకు యంగ్ హీరోలు రెడీగా ఉన్నారు.

 

ఇలాంటి టైంలో వెంకీ చెప్పిన రొమాంటిక్ ల‌వ్ స్టోరీని చ‌ర‌ణ్ రిజెక్ట్ చేయండి ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news