Moviesబిగ్‌బాస్‌లో ఆ కంటెస్టెంట్ సుద్ధ వేస్ట్... రాహుల్ ఇంట‌ర్వ్యూలో గంగ‌వ్వ‌ సంచ‌ల‌నం

బిగ్‌బాస్‌లో ఆ కంటెస్టెంట్ సుద్ధ వేస్ట్… రాహుల్ ఇంట‌ర్వ్యూలో గంగ‌వ్వ‌ సంచ‌ల‌నం

యూట్యూబ‌ర్ గంగ‌వ్వ బిగ్‌బాస్ హౌస్ నుంచి అనారోగ్య కార‌ణాలతో బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న‌న్ని రోజులు గంగ‌వ్వ ఏం చేసినా సంచ‌ల‌నంగానే ఉండేది. ఇక ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన గంగ‌వ్వ బిగ్‌బాస్ 3 విన్న‌ర్ రాహుల్ సిప్లిగంజ్ నిర్వ‌హిస్తోన్న ఓ ఇంట‌ర్వూలో పాల్గొంది. ఈ క్ర‌మంలోనే గంగ‌వ్వ బిగ్‌బాస్ కంటెస్టెంట్ల గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. బిగ్‌బాస్ హౌస్‌లో దేత్త‌డి హారిక సుద్ధ వేస్ట్ అని.. ఆమెకు హౌస్‌లో ఉండే అర్హ‌త లేదంటూ ఫైర్ అయ్యింది.

 

చాలా మంది హౌస్‌లో సేఫ్ గేమ్ ఆడార‌ని… కుమార్ సాయి చాలా నిజాయితీతో ఆడాడంటూ గంగ‌వ్వ మెచ్చుకుంది. ఇక హారిక త‌న లోకం త‌న‌దే అన్న‌ట్టుగా.. ఎప్పుడూ కోపంతో ఉంటుంద‌ని చెప్పింది. ఇక అఖిల్ చాలా బాగుంటాడ‌ని.. అఖిల్‌తో ఉండ‌డం త‌న‌కు ఇష్ట‌మ‌ని.. అంత‌మాత్రాన అఖిల్ మంచోడ‌ని చెప్పలేం అంటూనే.. అఖిల్ – మోనాల్ జంట బాగుంటుంద‌ని చెప్పింది.

 

 

ఇక ఉన్న‌వారిలో అవినాష్ బాగా న‌వ్విస్తాడ‌ని గంగ‌వ్వ చెప్పింది. హౌస్‌లో ఉన్నా.. బ‌యట ఉన్నా తాను మాత్రం ఉన్న‌ది ఉన్న‌ట్టు చెపుతాన‌ని గంగ‌వ్వ చెప్పింది

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news