టైమ్స్ నౌ – సీ ఓట‌ర్ స‌ర్వే.. బిహార్ పీఠం ఎవ‌రిదో తేలిపోయింది…

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా అంద‌రి దృష్టి బిహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల మీదే ఉంది. ఈ ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలుస్తారా ? అని అన్ని జాతీయ, ప్రాంతీయ రాజ‌కీయ ప‌క్షాలు ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తున్నాయి. ఇప్ప‌టికే బీజేపీ – జేడీయూ కూట‌మి దూకుడుగా ఉంది. ఈ క్ర‌మంలోనే తాజాగా టౌమ్స్ నౌ, సీ ఓట‌ర్ ఇక్క‌డ గెలుపు ఎవ‌రిది ? అన్న‌దానిపై స‌ర్వే చేసింది. ఈ సర్వే ప్ర‌కారం అక్క‌డ మ‌రోసారి ఎన్డీయే కూటమి గెలుపు సాధించ‌బోతోంద‌ని అంచ‌నా వేసింది.

 

మొత్తం 243 స్థానాలు ఉన్న బిహార్ అసెంబ్లీలో ఎన్డీయే కూట‌మికి 160, యూపీఏ కూట‌మికి 76 స్థానాలు వ‌స్తాయ‌ని అంచ‌నా వేసింది. బీజేపీ 85 సీట్ల‌తో అతిపెద్ద పార్టీగా అవ‌త‌రిస్తుంద‌ని.. త‌ర్వాత 75 సీట్ల‌తో జేడీయూ రెండో స్థానంలో ఉంటుంది. ఇక ఎన్డీయే కూట‌మిలోని మిగిలిన భాగ‌స్వామ్య ప‌క్షాల‌కు మ‌రో ఐదు సీట్లు వ‌స్తాయి.

 

ఇక యూపీమే కూట‌మిలో ఆర్జేడీకి ఎక్కువుగా 56 స్థానాలు, కాంగ్రెస్‌కు 15, వామ‌ప‌క్షాల‌కు మ‌రో ఐదు సీట్లు వ‌స్తాయ‌ట‌. ఇక ఎన్డీయే కూట‌మి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి 143 సీట్ల‌లో పోటీ చేస్తోన్న లోక్‌జ‌న శ‌క్తి పార్టీకి కేవ‌లం ఐదు సీట్ల‌కు మించి రావ‌డ‌ట‌. ఇక రాష్ట్రంలో మెజార్టీ ప్ర‌జ‌లు నితీష్ కుమార్ సీఎం కావాల‌ని బ‌లంగా కోరుకుంటున్నారు.