Moviesబిగ్‌బాస్ అఖిల్‌కు ఆ హీరోయిన్‌తో ల‌వ్ ఫెయిల్‌.. నాలుగేళ్లు పిచ్చి కుక్క‌లా...

బిగ్‌బాస్ అఖిల్‌కు ఆ హీరోయిన్‌తో ల‌వ్ ఫెయిల్‌.. నాలుగేళ్లు పిచ్చి కుక్క‌లా తిప్పుకుని..!

అఖిల్ సార్థ‌క్ బిగ్‌బాస్ హౌస్‌లో త‌న పెర్పామెన్స్‌తో ప్రేక్ష‌కుల మ‌న‌స్సుల‌ను గెలుచుకున్నాడు. అయితే మోనాల్ కంటే గేమ్ మీద కాన్‌సంట్రేష‌న్ చేస్తే బాగుంటుంద‌న్న చ‌ర్చ‌లు కూడా వ‌స్తున్నాయి. అఖిల్ మోనాల్‌తో ల‌వ్ ట్రాక్‌లో ఉండ‌డ‌మే అత‌డిని గేమ్‌లో వెన‌క‌ప‌డేలా చేస్తోంది. అఖిల్ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు మోనాల్‌ను తిట్టుకుంటున్నారు. అయితే హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన గంగ‌వ్వ అఖిల్ గురించి ప‌లు సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట పెట్టింది.

 

 

 

 

హౌస్‌లో ఉన్న వాళ్ల‌లో అఖిల్ అంటే త‌న‌కు ఇష్ట‌మ‌ని చెప్పిన గంగ‌వ్వ అఖిల్ ప్రేమ‌లో పెయిల్ అయ్యాడ‌ని చెప్పింది. అఖిల్ నాలుగేళ్ళు ప్రేమించిన హీరోయిన్ అతనికి హ్యాండ్ ఇచ్చిందట. మ‌నోడు పెళ్లి ప్ర‌స్తావ‌న తేగానే అఖిల్‌ను దూరం పెట్ట‌డంతో పాటు ఈ కుక్క‌కు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రావ‌ట్లేద‌ని కామెంట్ చేసింద‌ట‌. దీంతో మ‌న‌స్థాపానికి గురైన అఖిల్ ఆమెను లైట్ తీస్కొన్నాడ‌ట‌.

 

 

అంత‌లా నాలుగేళ్లు పిచ్చి కుక్క‌లా ప్రేమించి ఫెయిల్ అయిన అఖిల్ ఇప్పుడు మోనాల్‌తో అంత ఈజీగా ఎలా క‌నెక్ట్ అయ్యాడ‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. హౌజ్‌లో అఖిల్ మోనాల్‌తో పాటు ఇత‌రుల‌తో పులిహోర క‌ల‌ప‌డం మానేసి గేమ్ మీద దృష్టి పెడితే ఖ‌చ్చితంగా ఫైనల్ రేసులో ఉంటాడ‌ని ప‌లువురు సూచిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news