Moviesఆ హీరోయిన్‌కు మాత్ర‌మే మోహ‌న్‌బాబు భ‌య‌ప‌డ‌తాడా.. ఎవ‌రో తెలుసా..!

ఆ హీరోయిన్‌కు మాత్ర‌మే మోహ‌న్‌బాబు భ‌య‌ప‌డ‌తాడా.. ఎవ‌రో తెలుసా..!

విల‌క్ష‌ణ న‌టుడు, క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు అంటే ఇండ‌స్ట్రీలో ఎంతోమంది భ‌య‌ప‌డ‌తారు. ఎందుకంటే ఆయ‌న ఉన్న‌ది ఉన్న‌ట్టు కుండ‌బ‌ద్ద‌లు కొట్టేస్తుంటారు. ఎక్క‌డైనా తేడా వ‌స్తే ఎవ‌రి జీవితాల‌ను అయినా ఉన్న‌ది ఉన్న‌ట్టు ముందు పెట్టేస్తారు. ఇక ఆయ‌న క్ర‌మ‌శిక్ష‌ణ‌, అంకిత‌భావమే కాదు.. రాజ‌కీయాల్లో ఇప్పుడున్న ఎంతో మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల‌తో ఆయ‌న‌కు మంచి అనుబంధం ఉంది. మోహ‌న్‌బాబు క్ర‌మ‌శిక్ష‌ణ‌కు ఎంతో మంది సినీ, రాజ‌కీయ రంగాల‌కు చెందిన వారు కూడా గౌర‌వం ఇస్తూ ఉంటారు.

 

 

మోహ‌న్‌బాబు అంటే ఇంట్లో కూడా పిల్ల‌ల‌కు బేజారే. మోహ‌న్‌బాబు అంటే పిల్ల‌లు మంచు విష్ణు, మ‌నోజ్‌కు ఎంతో భయం అట‌. కుమార్తె గారాల‌ప‌ట్టి కాబట్టి కాస్త చ‌నువు తీసుకున్నా… కుమారులు ఇద్ద‌రూ కూడా తండ్రి అంటే భ‌య‌ప‌డే ఉంటార‌ని వాళ్లే చెపుతుంటారు. అలాంటి మోహ‌న్‌బాబునే భ‌య‌పెట్టే హీరోయిన్ ఒక‌రు ఉన్నార‌ట‌. ఓ హీరోయిన్‌కు మోహ‌న్‌బాబు భ‌య‌ప‌డ‌డ‌మా ? అన్న డౌట్‌లో ఉన్నారా ? అయితే ఆ హీరోయిన్ నిజ జీవిత హీరోయిన్ కాదు.. బాబు రియ‌ల్ హీరోయిన్ అయిన బాబు భార్య నిర్మ‌లాదేవి.

 

ఈ విష‌యాన్ని ఆయ‌నే చెప్పారు. తాను భ‌య‌ప‌డేది ఒక్క త‌న భార్య‌కు మాత్ర‌మే అని చెప్పారు. మోహ‌న్‌బాబు త‌న సినీ జీవితంలో ప‌దుల సంఖ్య‌లో హీరోయిన్ల‌తో క‌లిసి న‌టించారు. అంద‌రూ హీరోయిన్లు ఆయ‌న క్ర‌మ‌శిక్ష‌ణ‌ను ఎంతో గౌర‌విస్తారు… ఈ విష‌యాన్ని ప‌లు సంద‌ర్భాల్లో ప‌లువురు హీరోయిన్లు చెప్ప‌డ‌మే ఆయ‌న క్ర‌మ‌శిక్ష‌ణ‌కు నిద‌ర్శ‌నం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news