Politicsవైసీపీ లేడీ ఎమ్మెల్యే రు. 80 ల‌క్ష‌లు ఎగ్గొట్టిందా.. పార్టీ నేత...

వైసీపీ లేడీ ఎమ్మెల్యే రు. 80 ల‌క్ష‌లు ఎగ్గొట్టిందా.. పార్టీ నేత వీడియో రిలీజ్‌

ప‌లు సంచ‌ల‌న ఆరోప‌ణ‌ల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌ల్లో ఉంటోన్న గుంటూరు జిల్లా తాడికొండ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీదేవి మ‌రో వివాదంలో చిక్కుకున్నారు. వైసీపీ కార్య‌కర్త‌లు ఆమెపై రివ‌ర్స్ అయ్యారు. త‌మ ద‌గ్గ‌ర నుంచి ఎన్నిక‌ల స‌మ‌యంలో తీసుకున్న డ‌బ్బులు ఇవ్వ‌డం లేద‌ని వైసీపీ నేత మేక‌ల ర‌వి సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. శ్రీదేవి భ‌ర్త త‌న‌ను మోసం చేశాడ‌ని.. ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌న వ‌ద్ద తీసుకున్న రు. 1.40 కోట్లు తీసుకుని మ‌రో రు. 80 ల‌క్ష‌లు ఇవ్వలేద‌ని… తమ డ‌బ్బులు ఎప్పుడు ఇస్తార‌ని అడిగితే బెద‌రిస్తున్నారంటూ ర‌వి క‌న్నీరు పెట్టుకున్నాడు.

రు. 80 ల‌క్ష‌లు ఎప్పుడు ఇస్తార‌ని అడిగితే డీసీఎంఎస్ డైరెక్ట‌ర్ ప‌ద‌వి ఇచ్చినందుకు స‌రిపెట్టుకోవాల‌ని ఎమ్మెల్యే శ్రీదేవి స‌మాధానం ఇవ్వ‌డంతో పాటు ఇంటికి వెళితే గెట‌వుట్ అంటూ స‌మాధానం ఇచ్చి.. నానా విధాలా దుర్భాష‌లాడింద‌ని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎస్పీకి ఫోన్ చేసి లోపల వేయిస్తాన‌ని కూడా బెదిరించింద‌ని… శ్రీదేవి చ‌ర్య‌ల‌తో తాడికొండ వైసీపీ కార్య‌క‌ర్త‌లు ఆత్మ‌హ‌త్య చేసుకునే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని ర‌వి వాపోయాడు.

 

సీఎం జ‌గ‌న్ స్పందించి త‌న‌కు న్యాయం చేయ‌క‌పోతే రాజ‌ధానిలో తొలి మ‌ర‌ణం త‌న‌దే అవుతుంద‌ని కూడా వీడియోలు క‌న్నీరు పెట్టుకున్నాడు. తాడికొండ‌లో శ్రీదేవి అరాచ‌కాల‌పై సీఎం జ‌గ‌న్ స్వ‌యంగా దృష్టి పెట్టాల‌ని కూడా ర‌వి కోరాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news