Newsఫేస్‌బుక్ ప‌రిచ‌యంతో యువ‌తిని రేప్ చేసిన కానిస్టేబుల్‌

ఫేస్‌బుక్ ప‌రిచ‌యంతో యువ‌తిని రేప్ చేసిన కానిస్టేబుల్‌

ఫేస్‌బుక్‌లో ఓ యువ‌తికి ప‌రిచ‌యం అయిన కానిస్టేబుల్ ఆమెతో ప‌రిచ‌యం పెంచుకుని ప్రేమిస్తున్నాన‌నంటూ న‌మ్మించి ఆమెపై ప‌లు మార్లు అత్యాచారం చేసి ఆ త‌ర్వాత మొహం చాటేశాడు. చెన్నై అంబత్తూరుకు చెందిన యువతి (21)కి వేలూరు సెంట్రల్‌ జైలులో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ గణేష్‌కుమార్ ఫేస్‌బుక్‌లో ప‌రిచ‌యం అయ్యాడు. ఆ త‌ర్వాత అది ప్రేమ‌గా మార‌డంతో ఆ యువ‌తి వేలూరు వ‌చ్చింది. గ‌ణేష్ ఆ యువ‌తిని త‌న క్వార్ట‌ర్‌కు తీసుకు వెళ్లి కూల్ డ్రింక్‌లో మ‌త్తుమందు క‌లిపి మ‌త్తులోకి వెళ్ల‌గాన అత్యాచారం చేశాడు.

త‌ర్వాత ఆ వీడియో చూపించి బెదిరించి ప‌లుమార్లు ఆమెపై అత్యాచారం చేస్తూనే ఉన్నాడు. పెళ్లి చేసుకోవాలని అడిగితే మోసం చేసి వేరే యువతిని చేసుకునేందుకు సిద్ధమయ్యాడని వాపోయిన ఆ యువ‌తి పోలీసులకు ఫిర్యాదు చేయ‌లేదు. చివ‌ర‌కు ఆ యువ‌తిని ఫోన్లో బెదిరిస్తోన్న ఆడియోలు పోలీసుల‌కు ఇవ్వ‌గా పోలీసులు జైలు కానిస్టేబుల్‌ గణేష్‌కుమార్‌ను వందవాసి సబ్‌ జైలుకు బదిలీ చేశారు.

పోలీసులు విచార‌ణ ప్రారంభించారు. అయితే గణేష్‌ కుమార్‌ గత నెల రోజులుగా విధులకు హాజరుకాకుండా పరారీలో ఉన్నట్లు తెలిసింది. యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జైలు ఉన్నతాధికారులు కానిస్టేబుల్‌ గణేష్‌కుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ శనివారం ఉదయం ఆదేశాలు జారీ చేశారు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news