Moviesటీవీ న‌టి శ్రావ‌ణి - ఆ సినిమా నిర్మాత ఫోన్ కాల్...

టీవీ న‌టి శ్రావ‌ణి – ఆ సినిమా నిర్మాత ఫోన్ కాల్ లీక్‌

ప్ర‌ముఖ బుల్లితెర న‌టి శ్రావ‌ణి ఆత్మ‌హ‌త్య కేసులో మ‌రో కీల‌క మ‌లుపు చోటు చేసుకుంది. శ్రావ‌ణి మృతికి దేవ‌రాజు వేధింపులే కార‌ణ‌మ‌ని కుటుంబ స‌భ్యులు ఫిర్యాదు చేసిన నేప‌థ్యంలో ఈ కేసు స‌రికొత్త మ‌లుపులు తీసుకుంటోంది. దేవ‌రాజ్ త‌న‌కు శ్రావ‌ణికి సంబంధాలు బాగానే ఉన్నాయ‌ని.. సాయి అనే వ్య‌క్తి వ‌ల్లే శ్రావ‌ణి చ‌నిపోయింద‌ని దేవ‌రాజ్ ఆరోపించగా.. సాయి మాత్రం దేవ‌రాజ్ వ‌ల్లే శ్రావ‌ణి చ‌నిపోయింద‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే.

ఇదిలా ఉంటే ఆర్‌ఎక్స్‌100 సినిమా నిర్మాత అశోక్‌రెడ్డి- శ్రావణి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో లీకైంది. దేవరాజు మీద శ్రావణి కేసు నమోదు చేసిన స‌మ‌యంలోనే వీరిద్ద‌రి మ‌ధ్య ఈ సంభాష‌ణ జ‌రిగిన‌ట్టు తెలిపింది. ఇక దేవ‌రాజ్ టిక్‌టాక్‌లో అమ్మాయిలను ఫ్రెండ్స్‌ చేసుకుని. వారితో స్నేహం పెంచుకోవ‌డంతో పాటు ఆ త‌ర్వాత వారిని ప్రేమ మ‌త్తులోకి దింపి వారి నుంచి బ్లాక్‌మెయిట్ చేసి డ‌బ్బులు గుంజేవాడ‌ట‌.

గ‌తంలోనూ ప‌లువురి మ‌హిళ‌ల‌తో ఇదే విధంగా ప‌రిచ‌యం పెంచుకుని వారిని బ్లాక్ మెయిల్ చేసేవాడ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇక శ్రావ‌ణి కూడా దేవ‌రాజ్‌పై గ‌తంలో ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ప్రేమించి, మొహం చాటేయడంతో మనస్తాపానికి గురైన శ్రావణి ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబసభ్యులు దేవరాజుపై ఆరోపణలు చేస్తున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news