Moviesఅందుకే సెల‌బ్రిటీలు బిగ్‌బాస్‌కు దూరం... కౌశ‌ల్ షాకింగ్ కామెంట్స్‌

అందుకే సెల‌బ్రిటీలు బిగ్‌బాస్‌కు దూరం… కౌశ‌ల్ షాకింగ్ కామెంట్స్‌

వ‌ర‌ల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ పాపుల‌ర్ షో తెలుగులో నాలుగో సీజ‌న్లోకి వ‌చ్చేసింది. గ‌త ఆదివారం తెలుగు బిగ్‌బాస్ నాలుగో సీజ‌న్ ప్రారంభ‌మైంది. ఈ సీజ‌న్లో మొత్తం 16 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. ఈ సారి హౌస్‌లో చాలా మంది కొత్త‌వారే ఉన్నారు. ముఖ్యంగా టెలివిజ‌న్‌, యూట్యూబ‌ర్లును దించేయ‌డంతో వీరు ఒక‌రిని మించిన ఓవ‌ర్ యాక్ష‌న్‌తో మ‌రొక‌రు విసుగు పుట్టిస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ఏదేమైనా ఈ సారి హౌస్‌లో కంటెస్టెంట్లు చాలా వ‌ర‌కు నిరాశ ప‌రుస్త‌న్నార‌నే టాక్ అయితే వ‌చ్చేసింది. రేటింగ్ కూడా ఆశించినంత లేక‌పోవ‌డంతో బిగ్‌బాస్ నిర్వాహ‌కులు మ‌రో ఇద్ద‌రు ఫేమ‌స్ కంటెస్టెంట్ల‌ను రంగంలోకి దింపుతున్నార‌న్న ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. ఇక బిగ్‌బాస్ సీజ‌న్ 2 విజేత కౌశ‌ల్ సైతం దీనిపై స్పందించారు. ప్ర‌స్తుతం క‌రోనా కార‌ణంగా సెల‌బ్రిటీలు బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లేందుకు ఆస‌క్తి చూపించ‌లేద‌ని అర్థ‌మ‌వుతోంద‌న్నారు.

 

ఇక హౌస్‌లో త‌న‌ను ఆక‌ర్షించిన కంటెస్టెంట్ గంగ‌వ్వే అని.. ఇక డైరెక్ట‌ర్ సూర్య‌కిర‌ణ్ త‌న‌మాటే క‌రెక్ట్ అన్న వాద‌న‌తో ఉంటున్నాడ‌ని.. ఇది అన్ని వేళ‌లా ప‌నిచేయ‌ద‌ని కౌశ‌ల్ చెప్పాడు. ఇలాగే కంటిన్యూ అయితే సూర్య‌కిర‌ణ్ మూల్లం చెల్లించుకోక త‌ప్ప‌ద‌ని కౌశ‌ల్ అన్నాడు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news