MoviesR R R లో శ్రేయ క‌న్‌ఫార్మ్‌... రోల్‌పై క్లారిటీ వ‌చ్చేసింది..

R R R లో శ్రేయ క‌న్‌ఫార్మ్‌… రోల్‌పై క్లారిటీ వ‌చ్చేసింది..

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ క‌రోనా నేప‌థ్యంలో వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ యేడాది జూన్‌లో రావాల్సిన సినిమా వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 8న రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. ఇప్పుడు క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ‌తో ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఎప్పుడు వస్తుందో ? కూడా తెలియ‌ని ప‌రిస్థితి. ఈ సినిమాలో ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ కొమ‌రం భీం, అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌ల్లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

Shriya Saran shares clip, says she is 'at home in Barcelona' - DTNext.in

ఈ సినిమాలో శ్రేయ న‌టిస్తోంద‌న్న వార్త‌లు ఎప్ప‌టి నుంచో ఉన్నాయి. దీనిపై క్లారిటీ ఇచ్చిన శ్రేయ తాను ఆర్ ఆర్ ఆర్‌లో అతిథి పాత్ర చేస్తున్నాన‌ని చెప్పింది. రాజమౌళితో మరోసారి పనిచేయడం ఆనందంగా ఉందని తెలిపింది. ఇక 2005లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి మూవీలో శ్రియ నటించిన సంగతి తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్‌లో చెర్రీకి జంట‌గా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news