Moviesస్వీట్ ఫ్యాన్స్‌కు సూప‌ర్ న్యూస్‌.... అనుష్క నిశ్శ‌బ్దం రిలీజ్ డేట్ వ‌చ్చేసింది..

స్వీట్ ఫ్యాన్స్‌కు సూప‌ర్ న్యూస్‌…. అనుష్క నిశ్శ‌బ్దం రిలీజ్ డేట్ వ‌చ్చేసింది..

స్వీటీ బ్యూటీ అనుష్క – మాధవన్ కాంబినేషన్ లో తెర‌కెక్కిన అనుష్క సినిమా ఓటీటీ ఎంట్రీకి రంగం సిద్ధ‌మైంది. ఈ సినిమాను అమోజాన్ ప్రైమ్‌కు ఇవ్వ‌డానికి మ‌రో అడుగు ముందు ప‌డింది. అక్టోబ‌ర్ 10 లేదా 17న ఈ సినిమా రిలీజ్ చేసేందుకు అమోజాన్ ప్రైమ్ రెడీ అవుతోన్న‌ట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెపుతున్నాయి. సాధార‌ణంగా శుక్ర‌వారం అర్ధ‌రాత్రి సినిమాను అప్‌లోడ్ చేస్తారు.

Nishabdham Movie Release Details 'నిశ్శ‌బ్దం'గా ఏప్రిల్ 2కి వెళ్లిపోయింది

వాస్త‌వానికి నిశ్శ‌బ్దం వి సినిమా కంటే ముందే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే గ్రాఫిక్స్‌, సీజీ వ‌ర్క్ డిలే అవ్వడంతో వాయిదా ప‌డింది. ఇక ఇప్పుడు అమెజాన్ పత్రినిధులు, అనుష్క, నిర్మాతలు అంతా ఫైనల్ కాపీ చూసుకున్నాక, డీల్ ఫైనల్ అయిన‌ట్టు భోగ‌ట్టా. ఏదేమైనా చాలా రోజుల త‌ర్వాత అనుష్క న‌టించిన సినిమా రిలీజ్ అవుతుండ‌డంతో ఆమె ఫ్యాన్స్ మొత్తానికి ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ముందు కొత్త ట్రైల‌ర్ రిలీజ్ చేసిన వెంట‌నే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయ‌నున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news