ఈ ముగ్గురు క్రేజీ డైరెక్ట‌ర్ల ల‌క్కీ యాక్ట‌ర్లు ఎవ‌రో తెలుసా..!

సినిమా రంగంలో ఉన్న సెంటిమెంట్ల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక్క‌డ ప్ర‌తి చిన్న విష‌యం కూడా సెంటిమెంట్‌తోనే ముడిప‌డి ఉంటుంది. కొంద‌రు ద‌ర్శ‌కులు, హీరోల‌కు, ద‌ర్శ‌కుల‌కు, నిర్మాత‌ల‌కు మ‌ధ్య సెంటిమెంట్ కాంబినేష‌న్ల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు ద‌ర్శ‌కుల సినిమాల్లో కొంద‌రు న‌టులు త‌ప్ప‌కుండా ఉంటారు.

Harish Shankar playing the waiting game.. Will it be worth it? - tollywood

ఆ ద‌ర్శ‌కులు ఇదో సెంటిమెంట్‌. రాజ‌మౌళి సినిమాలో చంద్ర‌శేఖ‌ర్ అనే న‌టుడు త‌ప్ప‌కుండా ఉంటాడు. పాత్ర చిన్న‌ది అయినా పెద్ద‌ది అయినా చంద్ర‌శేఖ‌ర్ మాత్రం ఉంటాడు.హ‌రీష్ శంక‌ర్ సినిమా అంటే రావు ర‌మేష్ త‌ప్ప‌కుండా ఉండాల్సిందే. ఒక్క సినిమా మిన‌హా అన్ని సినిమాల్లోన రావు ర‌మేష్ త‌ప్ప‌కుండా ఉంటాడు. ఇక పూరి జ‌గ‌న్నాథ్ డైరెక్ట్ చేసిన సినిమాల్లో సుబ్బ‌రాజు ఎక్కువుగా ఉంటాడు.

Puri Jagannadh's podcast Puri Musings receives accolades from film frat |  Telugu Movie News - Times of India

సుబ్బ‌రాజుకు కెరీర్ ఆరంభంలో మంచి పేరు రావ‌డానికి పూరియే కార‌ణం. పూరి డైరెక్ట్ చేసిన ఎనిమిది సినిమాల్లో సుబ్బ‌రాజు క‌నిపించాడు.వ‌ర్మ సినిమాల్లో త‌నికెళ్ల భ‌ర‌ణి, కృష్ణ‌వంశీ సినిమాల్లో బ్ర‌హ్మాజీ, త్రివిక్ర‌మ్ సినిమాల్లో అమిత్‌, శ్రీకాంత్ అడ్డాల సినిమాల్లో రావు ర‌మేష్ త‌ర‌చూ క‌నిపిస్తుంటారు.

Leave a comment