Moviesటాలీవుడ్ పార్టీల్లో డ్ర‌గ్స్... బిగ్ బాంబు పేల్చిన హీరోయిన్‌

టాలీవుడ్ పార్టీల్లో డ్ర‌గ్స్… బిగ్ బాంబు పేల్చిన హీరోయిన్‌

టాలీవుడ్ నటీమ‌ణి మాధ‌వీల‌త ఇటీవ‌ల కాలంలో ఫైర్‌బ్రాండ్‌లా విరుచుకు ప‌డుతోంది. మిగిలిన హీరోయిన్ల మాదిరిగా కాకుండా ఆమె ఏదైనా విష‌యం ఉన్న‌ది ఉన్న‌ట్టు కుండ‌బ‌ద్ద‌లు కొట్టేస్తోంది. ఇక బాలీవుడ్ న‌టుడు సుశాంత్‌సింగ్ మృతి త‌ర్వాత డ్ర‌గ్స్ ఇష్యూ కూడా తెర‌మీద‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక ఇప్పుడు ఇదే అంశంపై టాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ మాధ‌వీల‌త బాంబు పేల్చింది. టాలీవుడ్‌లో కూడా డ్ర‌గ్స్ తీసుకునే సెల‌బ్రిటీలు చాలా మందే ఉన్నార‌ని చెప్పింది.

tollywood: Hyderabad cops arrest Tollywood actress Madhavi Latha | Telugu  Movie News - Times of India

ఆమె త‌న తాజా ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ తాను సంచ‌ల‌నం కోసం మాట్లాడ‌డం లేద‌ని.. నిజాలే చెపుతున్నాన‌ని చెప్పింది. ఇక డ్ర‌గ్స్ విష‌యంలో పెద్ద‌లు ఎందుకు మాట్లాడ‌రంటూ ఆమె సూటిగా ప్ర‌శ్నించింది. ఇక గ‌తంలో తాను పాల్గొన్న పార్టీల్లో కూడా అక్క‌డ‌కు వ‌చ్చిన వారు డ్ర‌గ్స్ తీసుకున్నార‌ని చెప్పింది. ఇక ఇండ‌స్ట్రీలో ఒకేసారి పెద్ద ఎత్తున తెర‌పైకి వ‌చ్చిన డ్ర‌గ్స్ కేసులు ఆ త‌ర్వాత ఎందుకు మాయం అయ్యాయ‌ని కూడా మాధ‌వీల‌త ప్ర‌శ్నించింది.

Actress Madhavi Latha arrested outside Telugu Film Chamber

ఇక మాధ‌వీల‌త సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన నేప‌థ్యంలో ఇప్పుడు టాలీవుడ్‌లో ఒక్క‌సారిగా క‌ల‌క‌లం మొద‌లైంది. ప్ర‌తి ఒక్క‌రు మాధ‌వీల‌త ఏయే పార్టీల‌కు వెళ్లింది ? అక్క‌డ‌కు ఎవ‌రెవ‌రు వ‌చ్చారు ? వాళ్లు డ్ర‌గ్స్ వాడిన‌ట్టు ఆమెకు ఎలా తెలిసింది అనే విష‌యాల‌పై చ‌ర్చించుకుంటున్నారు. ఇక మీడియా కూడా దీనిపై ఫోక‌స్ పెట్ట‌డంతో అటు అధికారులు కూడా దీనిపై కూపీ లాగుతున్నార‌ని స‌మాచారం. ఏదేమైనా మాధ‌వీల‌త వ్యాఖ్య‌లు మాత్రం ఇండ‌స్ట్రీని ఓ కుదుపు కుదిపాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news