Gossipsవావ్‌: రామ్‌చ‌ర‌ణ్ - సాయిధ‌ర‌మ్ సినిమా ఫిక్స్ అయ్యింది... !

వావ్‌: రామ్‌చ‌ర‌ణ్ – సాయిధ‌ర‌మ్ సినిమా ఫిక్స్ అయ్యింది… !

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్ లో ఒక్క హీరోగానే కాకుండా అటు కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ పేరుతో బ్యాన‌ర్ స్థాపించి ఆ బ్యాన‌ర్‌పై త‌న తండ్రి హీరోగా బిగ్ ప్రాజెక్టులే నిర్మిస్తున్నాడు. ఓ వైపు భారీ బ‌డ్జెట్ సినిమాలు నిర్మిస్తోన్న చ‌ర‌ణ్ ఇప్పుడు మీడియం రేంజ్ హీరోల‌తో మీడియం బ‌డ్జెట్ సినిమాలు కూడా తీయాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే త‌న బ్యాన‌ర్లో మ‌రో మెగా హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు టాలీవుడ్ టాక్‌..!

Ram Charan only Can Remake Gang Leader Movie says Sai Dharam Tej

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్‌తో త‌న బ్యాన‌ర్లో ఓ మీడియం రేంజ్ బ‌డ్జెట్‌తో సినిమా ప్లాన్ చేశాడ‌ట‌. ఇది మెగా అభిమానుల‌కు కేక లాంటి న్యూసే. ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ ఆర్ ఆర్ ఆర్‌తో పాటు ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లో న‌టించ‌డంతో పాటు త‌న బ్యాన‌ర్లో సాయి తేజ్ హీరోగా నిర్మించే సినిమా బాధ్య‌త‌ల‌ను కూడా చూసుకోనున్నాడ‌ట‌. ఈ బాధ్య‌త‌లను త‌న బిజీని బ‌ట్టి త‌న సోద‌రి సుస్మిత‌కు అప్ప‌గించే ఆలోచ‌నోల కూడా ఉన్నాడ‌ని తెలుస్తోంది.

మెగా హీరో సినిమాపై మెగా హీరోలు ఏమన్నారంటే? | Ram charan, allu arjun  response on Sai Dharam tej latest Movie

ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌న్న‌ది తెలియ‌క‌పోయినా అనిల్ రావిపూడి పేరు ప్ర‌చారంలో ఉంది. ప్రస్తుతం సాయి తేజ్ సోలో బతుకే సో బెటర్ మరియు సుకుమార్ రైటింగ్స్ లో ఒక సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ రెండు సినిమాల‌తో పాటే చెర్రీ నిర్మించే సినిమా కూడా ప‌ట్టాలెక్క‌నుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news