Gossipsబిగ్‌బాస్ హౌస్‌లో మ‌రో హాట్‌ హీరోయిన్ ‌.... హౌస్ ఫుల్ క‌ల‌ర్‌ఫుల్‌

బిగ్‌బాస్ హౌస్‌లో మ‌రో హాట్‌ హీరోయిన్ ‌…. హౌస్ ఫుల్ క‌ల‌ర్‌ఫుల్‌

తెలుగు బిగ్‌బాస్ సీజ‌న్ 4 మ‌రో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే కంటెస్టెంట్ల గురించి మ్యాట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇప్ప‌టికే 15 మంది కంటెస్టెంట్ల పేర్లు బ‌య‌ట‌కు లీక్ అయ్యాయి. ఈ లిస్టులో అల్ల‌రి న‌రేష్ ప‌క్క‌న న‌టించిన హీరోయిన్ మోనాల్ గ‌జ్జ‌ర్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతోంద‌న్న వార్త‌ల‌తో హౌస్‌కు మ‌రింత క‌ల‌ర్ వ‌స్తుంద‌ని బిగ్‌బాస్ ఫ్యాన్స్ ఖుషీలో ఉండ‌గానే ఇప్పుడు మ‌రో హీరోయిన్ సైతం ఎంట్రీ ఇవ్వ‌బోతోంద‌న్న వార్త‌ల‌తో హౌస్‌లో ఇక ర‌చ్చ మామూలుగా ఉండ‌ద‌ని ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.

ఇంత‌కు ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు.. స్వాతి దీక్షిత్‌. ఇప్ప‌టికే ఉన్న బుల్లితెర యాంక‌ర్లు, టీవీ న‌టులు, టిక్‌టాక్ స్టార్ల‌కు తోడు ఇప్పుడు హీరోయిన్లు కూడా ఉండ‌డంతో బిగ్‌బాస్ 4 ఎప్పుడు ప్రారంభ‌మ‌వుతుందా ? అని ఒక్క‌టే ఉత్కంఠ నెల‌కొంది. టాప్ సెల‌బ్రిటీల్లో సైతం ఈ హౌస్ గురించే ఎక్కువ చ‌ర్చ న‌డుస్తోంది. ఇక స్వాతి దీక్షిత్ గ‌తంలో తెలుగులో ప‌లు సినిమాల్లో న‌టించింది.

స్వాతి సాహో దర్శకుడు సుజీత్ డైరెక్ట్ చేసిన షార్ట్ ఫిల్మ్‌లలో న‌టించింది. అల్ల‌రి న‌రేష్ జంప్ జ‌లానీ, బ్రేక్ అప్‌, లేడీస్ & జెంటిల్మెన్, ఆర్జీవి యొక్క పట్ట‌ పగలు, అంజలి చిత్రాంగ‌ద‌, తమిళ చిత్రం సాతురా సినిమాల్లో న‌టించింది. హాట్ ఇమేజ్ ఉన్న స్వాతి ఎంట్రీతో షోలో గ్లామ‌ర్‌తో పాటు హాట్‌నెస్‌కు కూడా కొద‌వ ఉండ‌దు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news