Newsతెలంగాణ‌లో దారుణం... వివాహిత అశ్లీల ఫొటోలు సోష‌ల్ మీడియాలో... క్లైమాక్స్ ఇదే..!

తెలంగాణ‌లో దారుణం… వివాహిత అశ్లీల ఫొటోలు సోష‌ల్ మీడియాలో… క్లైమాక్స్ ఇదే..!

స‌మాజంలో సోష‌ల్ మీడియా ప్ర‌భావం పెరిగిపోవ‌డంతో కొంద‌రు యువ‌కులు పైశాచిక‌త్వంతో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌లోని నిర్మ‌ల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వివాహిత అశ్లీల ఫోటోల‌ను ఓ యువ‌కుడు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ విష‌యం తెలుసుకున్న ఆమె ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. ఈ సంఘటన ముధోల్‌ మండల కేంద్రలో శనివారం చోటుచేసుకుంది.

పురుషోత్తం అనే వ్యక్తి ఓ వివాహితకు సంబంధించిన అసభ్యకరమ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఇవి స్థానికంగా వైర‌ల్ అయ్యాయి. అక్క‌డ ఆ వివాహిత ప‌రువు పోవ‌డంతో పాటు స్థానికంగా ఆమె గురించే చ‌ర్చించుకుంటున్నారు. దీంతో తీవ్ర మ‌న‌స్థాపానికి గురైన ఆ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమెను ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. భర్త ఫిర్యాదు మేరకు నిర్భయ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news