Moviesమ‌హేష్ - పూరి సినిమా.... ఇది మామూలు దెబ్బ కాదుగా...!

మ‌హేష్ – పూరి సినిమా…. ఇది మామూలు దెబ్బ కాదుగా…!

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు ప్ర‌స్తుతం ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న స‌ర్కారు వారి పాట సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్‌తో పాటు 14 రీల్స్ సంస్థ‌లు క‌లిసి నిర్మిస్తున్నాయి. గీతాగోవిందం సినిమాతో సూప‌ర్ హిట్ కొట్టిన ప‌ర‌శురాం మూడేళ్ల పాటు వెయిట్ చేసి మ‌రీ మ‌హేష్‌తో ఛాన్స్ కొట్టేశాడు. ప్ర‌స్తుతం క‌రోనా నేప‌థ్యంలో వ‌చ్చే యేడాదే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఈ సినిమా పొలిటిక‌ల్ సెటైర్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌నుంద‌ని తెలుస్తోంది.

ఈ సినిమా సంగ‌తి ఇలా ఉంటే మ‌హేష్ – పూరి సినిమా గురించి కూడా ఆయ‌న అభిమానుల్లోనూ, ఇటు సోష‌ల్ మీడియాలోనూ చ‌ర్చ న‌డుస్తోంది. స‌ర్కారు వారి పాట త‌ర్వాత మ‌హేష్ రాజ‌మౌళి సినిమా చేస్తాడ‌ని తెలుస్తోంది. అయితే ఆర్ ఆర్ ఆర్ ఎప్ప‌ట‌కి కంప్లీట్ అవుతుందో ?  మ‌హేష్ కోసం రాజ‌మౌళి మ‌ళ్లీ ఎన్ని రోజులు గ్యాప్ తీసుకుని సినిమా చేస్తాడో ?  కూడా తెలియ‌ని ప‌రిస్థితి ఉంది. ఈ గ్యాప్‌లో మ‌హేష్ పూరితో క‌మిట్ అయితే బాగుంటుంద‌ని మ‌హేష్ – పూరి అభిమానులు కోరుకుంటున్నారు.

మ‌ధ్య‌లో మ‌హేష్‌కు పూరికి గ్యాప్ వ‌చ్చింది. మ‌హేష్ కేవలం హిట్ డైరెక్ట‌ర్ల‌కే ఛాన్స్ ఇస్తాడంటూ పూరి చేసిన వ్యాఖ్య‌ల త‌ర్వాత మ‌హేష్ పూరిని ప‌ట్టించుకోలేదు. ఆ త‌ర్వాత ఫ్యాన్స్ కోరిక మేర‌కు ఓ సారి మాత్రం పూరి ఎప్పుడు ఓకే అన్నా సినిమా చేస్తాన‌ని చెప్పాడు. అయితే ఇటీవ‌ల మ‌హేష్ బ‌ర్త్ డే రోజు రిలీజ్ అయిన మోష‌న్ పోస్ట‌ర్ ప్ర‌స్తావ‌న తీసుకువ‌చ్చిన పూరి బ‌ర్త్ డే విషెస్ మాత్రం చెప్ప‌లేదు. ఇక మ‌హేష్ కోసం రాసుకున్న జ‌న‌గ‌ణ‌మ‌న ఇప్పుడు మ‌రో యంగ్ హీరోతో చేసే ప్ర‌య‌త్నాల్లో పూరి ఉన్నాడు. సో ఇవ‌న్నీ చూస్తుంటే ఇప్ప‌ట్లో మ‌హేష్ – పూరి ప్రాజెక్టు ప‌ట్టాలెక్కేలా లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news