Gossipsరేటు భారీగా పెంచేసిన ర‌ష్మిక‌... అడిగినంత ఇస్తేనే సినిమాకు ఓకే...!

రేటు భారీగా పెంచేసిన ర‌ష్మిక‌… అడిగినంత ఇస్తేనే సినిమాకు ఓకే…!

ర‌ష్మిక మంద‌న్న టాలీవుడ్‌లో త‌క్కువ టైంలోనే సూప‌ర్ డూప‌ర్ హిట్ల‌తో దూసుకుపోతోంది. ఈ యేడాది ఇప్ప‌టికే మ‌హేష్‌బాబు ప‌క్క‌న స‌రిలేరు నీకెవ్వ‌రు, నితిన్‌తో భీష్మ లాంటి రెండు బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్లు త‌న ఖాతాలో వేసుకుంది. ఇక ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్నీ న‌టిస్తోన్న పుష్ప సినిమాలోనూ ఆమే హీరోయిన్ అంటున్నారు. వ‌రుస క్రేజీ అవ‌కాశాలు.. సూప‌ర్ హిట్ల‌తో ర‌ష్మిక అమాంతం రేటు పెంచేసిందంటున్నారు. ఈ విష‌యంలో ఆమె ఎంత మాత్రం రేటు త‌గ్గించే ప్ర‌శ‌క్తే లేద‌ని చెపుతోంద‌ట‌.

 

ప్ర‌స్తుతం క‌రోనా క‌ష్ట‌కాలంలో కూడా ఆమె రేటు త‌గ్గించ‌న‌ని చెపుతోంద‌ట‌. ఇటీవ‌ల పూజా హెగ్డే సైతం రేటు త‌గ్గించుకోన‌ని చెపుతోంద‌ని అంటున్నారు. ఇప్పుడు ర‌ష్మిక కూడా పూజ బాట‌లోనే వెళుతోందట‌. ఛ‌లో సినిమాతో హిట్ కొట్టిన ఆమె అతి త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు ద‌క్కించుకోవ‌డంతో పాటు హిట్లు త‌న ఖాతాలో వేసుకుంది. ఇదే ఇప్పుడు ఆమె రేటు త‌గ్గించ‌న‌ని కొండెక్కేందుకు కార‌ణ‌మైంది.

 

ఓ వైపు క‌రోనా వేళ హీరోలు, హీరోయిన్లు సైతం రెమ్యున‌రేష‌న్ త‌గ్గించుకుంటున్నా ర‌ష్మిక మాత్రం తాను అనుకున్నంత ఇస్తేనే కొత్త సినిమాల‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇస్తాన‌ని చెపుతోంద‌ట‌. ర‌ష్మిక రేటు చూసి ఇప్పుడు స్టార్ హీరోలు సైతం షాక్ అయ్యే ప‌రిస్థితి ఉంది. ముఖ్యంగా ఆమె మిగిలిన భాష‌ల్లో ఎలా ఉన్నా టాలీవుడ్‌లో సినిమాల‌కే ఎక్కువ రేటు చెపుతోంద‌ని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news