Gossipsఆ స్టార్ హీరో భార్య పేరు చెపితే వ‌ణుకుతోన్న నిర్మాత‌లు.. ద‌ర్శ‌కులు..!

ఆ స్టార్ హీరో భార్య పేరు చెపితే వ‌ణుకుతోన్న నిర్మాత‌లు.. ద‌ర్శ‌కులు..!

టాలీవుడ్‌లో ఓ సూప‌ర్ హీరో భార్య పేరు చెపితేనే ప్ర‌స్తుతం ద‌ర్శ‌క నిర్మాత‌లు వ‌ణికి పోతున్నారా ? త‌న భ‌ర్త‌తో సినిమా చేయాలంటే ముందు ఆ భార్యామ‌ణి గారిని ప్ర‌స‌న్నం చేసుకోవాల్సిందేనా ? ఆమెను శాటిస్‌పై చేయాల్సిందే అట‌. స‌ద‌రు స్టార్ హీరో సినిమాల‌కు సంబంధించిన ఆర్థిక వ్య‌వ‌హారాలు అన్ని భార్య చేతుల్లోనే పెడుతుండ‌డంతో స‌ద‌రు హీరోతో సినిమా ఓకే చేయించుకోవాలి అంటే త‌ల ప్రాణం తోక‌కే వ‌స్తోంద‌ని అంటున్నారు. ముఖ్యంగా రెమ్యున‌రేష‌న్ విష‌యంలో ఆమె ఎక్కిన చెట్టు దిగ‌డం లేద‌ట‌.

 

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అంత ఇవ్వ‌డం క‌ష్ట‌మ‌ని చెపుతున్నా.. ఇంటికి వెళ్లిన వారికి స‌క‌ల మ‌ర్యాద‌లు చేసి మ‌రీ మీరు ఏం మాట్లాడుతున్నారు.. ఆయ‌న ఇమేజ్ ఏంటి ? అన‌డంతో పాటు నా భ‌ర్త సినిమాకు ఎక్క‌డ ఎంత బిజినెస్ అవుతుందో ? లెక్క‌ల‌తో స‌హా చెపుతోంద‌ట ఆ భార్యామ‌ణి. అస‌లు హీరో గారిక‌న్నా ఆయ‌న భార్యామ‌ణే రెమ్యున‌రేష‌న్ విష‌యంలో చాలా క‌ఠినంగా ఉండ‌డంతో ద‌ర్శ‌కులు, నిర్మాత‌ల‌కు ఆమె ద‌గ్గ‌ర‌కు వెళ్లి క‌థ చెప్పాల‌న్నా.. సినిమాను ఓకే చేయించుకోవాల‌న్నా గుండెలు గుబేల్ మంటున్నాయ‌ట‌.

 

కేవ‌లం ఆమె ఆర్థిక వ్య‌వ‌హారాల విష‌యంలో ఎక్క‌డా వెన‌క్కు త‌గ్గ‌లేదంటున్నారు. దీంతో ఇటీవ‌ల స‌ద‌రు స్టార్ హీరోతో సినిమా చేయాల‌ని వెళ్లి ఆమె పెట్టిన కండీష‌న్లు, డిమాండ్లు విని వెనక్కి వ‌చ్చేశాడ‌ని అంటున్నారు. ఇదే ప‌రిస్థితి ఇండ‌స్ట్రీలో ప‌లువురు నిర్మాత‌లు ఎదుర్కొంటున్నార‌ట‌. ఆ హీరో వ్య‌వ‌హారాల్లో భార్య‌ను ప‌క్క‌న పెట్ట‌క‌పోతే ఆ హీరో చాలా మంచి అవ‌కాశాలు మిస్ చేసుకోవాల్సి వ‌స్తోంద‌న్న గుస‌గుస‌లు కూడా ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news