Gossipsర‌ష్మిక 20 నిమిషాల‌కు అంత డిమాండ్ చేసిందా... వామ్మో ఏంటీ ఈ...

ర‌ష్మిక 20 నిమిషాల‌కు అంత డిమాండ్ చేసిందా… వామ్మో ఏంటీ ఈ క్రేజ్‌…!

క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న ఇప్పుడు తెలుగులో వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతోంది. ఛ‌లో, స‌రిలేరు నీకెవ్వ‌రు, భీష్మ లాంటి సూప‌ర్ డూప‌ర్ హిట్లు ఆమె ఖాతాలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ యేడాది ఇప్ప‌టికే ఆమె స‌రిలేరు నీకెవ్వ‌రు, భీష్మ లాంటి హిట్ల‌తో మంచి జోరుమీద ఉంది. ప్ర‌స్తుతం ర‌ష్మిక అల్లు అర్జున్ స‌ర‌స‌న భీష్మ సినిమాలో న‌టిస్తోంది. సుకుమార్ డైరెక్ష‌న్‌లో పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ప్ర‌స్తుతం క‌రోనా నేప‌థ్యంలో ఈ సినిమా షూటింగ్ వాయిదా ప‌డింది.

 

ఇదిలా ఉంటే ర‌ష్మిక‌కు స్టార్ హీరోల సినిమాల్లో కూడా మంచి ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ప‌క్క‌న ఆచార్య సినిమాలో న‌టించేందుకు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఆమెను సంప్ర‌దించిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమాలో ర‌ష్మిక రోల్ కేవ‌లం 20 నిమిషాలు మాత్ర‌మే ఉంటుంద‌ట‌. ఈ 20 నిమిషాల రోల్ కోసం ఆమె ఏకంగా రు. కోటి డిమాండ్ చేసిన‌ట్టు టాలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందుకోసం ఆమెకు రు. 40 నుంచి రు. 50 ల‌క్ష‌ల వ‌ర‌కు ఇవ్వాల‌ని ముందుగా అనుకున్నార‌ట‌.

 

అయితే ఇప్పుడు ర‌ష్మిక ఏకంగా రు. కోటి డిమాండ్ చేయ‌డంతో ద‌ర్శ‌క నిర్మాత‌లు అవాక్కైన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏదేమైనా తెలుగులో ర‌ష్మిక క్రేజ్ చూసి ఇప్పుడు ఆమె అడిగినంత ఇచ్చుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితులు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు వ‌చ్చేశాయి. ఏదేమైనా ర‌ష్మిక క్రేజ్ మాత్రం మామూలుగా లేదు. ఎన్టీఆర్ స‌ర‌స‌న కూడా ఆమెను ఓ సినిమాలో న‌టింప‌జేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news