Gossipsఆ డైరెక్ట‌ర్‌తో ఎన్టీఆర్ సినిమానా... వామ్మో దండం పెట్టేస్తోన్న ఫ్యాన్స్‌...!

ఆ డైరెక్ట‌ర్‌తో ఎన్టీఆర్ సినిమానా… వామ్మో దండం పెట్టేస్తోన్న ఫ్యాన్స్‌…!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే సినిమాలో న‌టించ‌నున్నాడు. ఈ సినిమా కూడా త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. ఆ త‌ర్వాత ఎన్టీఆర్ కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్రశాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే సినిమాలో న‌టించ‌నున్నాడ‌ని టాక్‌. ఈ క్ర‌మంలోనే లాక్‌డౌన్ స‌మ‌యంలో ప‌లువురు ద‌ర్శ‌కులు ఎన్టీఆర్‌కు క‌థ‌లు చెపుతున్నార‌ట‌.

 

వీరిలో మెహ‌ర్ ర‌మేష్ కూడా ఓ క‌థ చెప్పిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో తీవ్ర ఆందోళ‌న మొదలైంది. వామ్మో మెహ‌ర్ ర‌మేష్‌కు అస‌లు క‌థ చెప్పే అవ‌కాశం కూడా ఎన్టీఆర్ ఎందుకు ఇచ్చాడ్రా బాబు అని త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఎందుకంటే మెహ‌ర్ ర‌మేష్‌కు గ‌తంలో ఎన్టీఆర్ రెండుసార్లు ఛాన్స్ ఇస్తే రెండు సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి. 2008లో వ‌చ్చిన కంత్రి, 2011లో వ‌చ్చిన శ‌క్తి సినిమాలు రెండు ప్లాప్ అయ్యాయి.

 

అసలు శ‌క్తి ఎన్టీఆర్ కెరీర్‌లోనే పెద్ద డిజాస్ట‌ర్ అయ్యింది. అలాంటి డైరెక్ట‌ర్‌కు అసలు క‌థ వినే అవ‌కాశం కూడా ఎన్టీఆర్ ఇవ్వ‌కూడ‌ద‌ని.. అస‌లు మెహ‌ర్ ర‌మేష్‌ను ద‌గ్గ‌ర‌కే రానియ‌వద్దంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో సూచిస్తున్నారు. మెహ‌ర్ ర‌మేష్‌కు ఓ దండం బాబోయ్ అని ట్రోల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ మెహ‌ర్‌కు మళ్లీ ఛాన్స్ ఇస్తాడా ? లేదా ? అన్న‌ది ప‌క్క‌న పెడితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం మెహ‌ర్ పేరు చెపితేనే మండిప‌డుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news