Gossipsమ‌ల్టీస్టార‌ర్‌గా గ‌బ్బ‌ర్‌సింగ్ 2... ప‌వ‌న్‌తో న‌టించే ఆ స్టార్ హీరో ఎవ‌రు...!

మ‌ల్టీస్టార‌ర్‌గా గ‌బ్బ‌ర్‌సింగ్ 2… ప‌వ‌న్‌తో న‌టించే ఆ స్టార్ హీరో ఎవ‌రు…!

ప‌వ‌న్‌క‌ళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చా కెరీర్‌లో ఎప్పుడు లేనంత స్పీడ్‌తో సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఇప్ప‌టికే వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న వ‌కీల్‌సాబ్ సినిమాతో పాటు ఆ వెంట‌నే క్రిష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించే సినిమా చేయ‌నున్నాడు. ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయిన వెంట‌నే గ‌బ్బ‌ర్‌సింగ్ కాంబినేష‌న్ రిపీట్ కానుంది. గ‌బ్బ‌ర్‌సింగ్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ గ‌బ్బ‌ర్‌సింగ్ 2 సినిమాను తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నారు.

Gabbar Singh 2 Movie Punch Dialogues Leaked!

ఇప్ప‌టికే హ‌రీష్ శంక‌ర్ ప‌వ‌న్‌ను క‌లిసి క‌థ కూడా చెప్పాడంటున్నారు. ఇక ఈ సినిమా మ‌ల్టీస్టార‌ర్ స్టోరీ అని తెలుస్తోంది. ఇందులో ప‌వ‌న్ ఓ హీరోగా ఉండ‌గా.. రెండో హీరోగా కూడా మ‌రో స్టార్ హీరోను న‌టింపజేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయంటున్నారు. ప‌వ‌న్ ప‌క్క‌న న‌టించే ఆ స్టార్ హీరో ఎవ‌రా ? అన్న దానిపై ఇండ‌స్ట్రీలో ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు కూడా న‌డుస్తున్నాయి.

 

ఓ యంగ్ స్టార్ హీరోతో పాటు గ‌తంలో ప‌వ‌న్‌తో క‌లిసి గోపాల గోపాల‌లో న‌టించిన సీనియ‌ర్ హీరో వెంక‌టేష్‌ల‌లో ఎవ‌రో ఒక‌రు ఈ సినిమాలో న‌టించే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు. అయితే త‌న‌కు సూప‌ర్ డూప‌ర్ హిట్ ఇచ్చిన గ‌బ్బ‌ర్‌సింగ్ సీక్వెల్‌ను మ‌ల్టీస్టార‌ర్‌గా చేసే విష‌యంలో ప‌వ‌న్ అంత ఆస‌క్తిగా లేడ‌ని మ‌రో టాక్ కూడా వ‌స్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news