Politicsబాలయ్య చిన్నల్లుడుని టచ్ చేయడం కష్టమేనా..?

బాలయ్య చిన్నల్లుడుని టచ్ చేయడం కష్టమేనా..?

ఏపీ రాజధాని…ఇప్పుడు రాష్ట్రంలో బాగా హాట్ టాపిక్ అవుతున్న అంశం ఇదే. జగన్ ప్రభుత్వం మూడు రాజధానులని తెరపైకి తీసుకురావడంతో, ఏపీ రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. అందరికీ అందుబాటులో ఉండే అమరావతిని కాదని జగన్ తన సొంత ప్రయోజనాల కోసం మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే, రాష్ట్రాభివృద్ధి కోసమే మూడు రాజధానులని వైసీపీ నేతలు చెబుతున్నారు.

 

అయితే ఇరుపక్షాలు ఎంత వాదించుకున్నా అసలు విషయం మాత్రం ప్రజలకు బాగా తెలుసు. ఎవరు స్వార్ధంతో రాజధాని రాజకీయ క్రీడ మొదలుపెట్టారో ప్రజలకు అర్ధమవుతుంది. ఇక రాజధాని రాజకీయంలో టీడీపీకి కోలుకోలేని షాకులు తగులుతాయని పలువురు మేధావులు విశ్లేషణలు తెరపైకి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కానున్న విశాఖపట్నంలో టీడీపీ పరిస్థితి ఘోరంగా తయారవుతుందని అంచనా వేస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితుల్లోకి వెళితే విశాఖలో వీక్ అయినట్లు కనిపించడం లేదు.

Balayya Chinnalludu's Sri Bharat Impressive Campaign in Vizag

వైసీపీ నాయకులు ఏదో జరిగిపోతుందనే భ్రమలు కల్పిస్తున్నారు తప్పా, విశాఖలో టీడీపీని కదపలేరని తెలుస్తోంది. ఎందుకంటే విశాఖ అభివృద్ధి ఎవరు చేశారో, ఇప్పుడు రాజధాని అని చెప్పి రాజకీయం ఎవరు చేస్తున్నారో అక్కడి ప్రజలకు బాగా తెలుసు. కాబట్టి విశాఖలో టీడీపీకి పోయేదేమీ లేదు. అలాగే మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు సైతం పుంజుకుంటున్నారు. ముఖ్యంగా బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్ పరిస్థితి మెరుగైనట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో భరత్ కేవలం 4 వేల ఓట్ల తేడాతోనే విశాఖ పార్లమెంట్ స్థానంలో ఓటమి పాలయ్యారు.

గీతం'' విద్యాసంస్థల అధ్యక్షుడిగా ...

రాష్ట్రమంతా జగన్ వేవ్ ఉన్నా సరే భరత్ స్వల్ప మెజారిటీతోనే ఓడిపోయారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఓడిపోయాక కూడా భరత్ విశాఖ ప్రజలకు అండగానే ఉంటున్నారు. ఇక్కడ టీడీపీ కేడర్‌తో పాటు, భరత్ ఫ్యామిలీకు ఉన్న ఫాలోయింగ్ వల్ల వైసీపీ భరత్‌ని వీక్ చేయలేకపోతుంది. ఏదేమైనా మూడు రాజధానుల ప్రభావం భరత్ మీద ఏ మాత్రం లేదని, ఓట‌మి త‌ర్వాత ఆయ‌న మ‌రింత క‌సితో రాజ‌కీయాలు చేస్తూ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న వ్యక్తిగ‌త ఇమేజ్ మ‌రింత పెర‌గ‌డం విశేషం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news