Politicsహైద‌రాబాద్ హాస్ప‌ట‌ల్స్‌లో కోవిడ్ పేరుతో దారుణాలు... మీరు జాయిన్ అయితే అంతే...

హైద‌రాబాద్ హాస్ప‌ట‌ల్స్‌లో కోవిడ్ పేరుతో దారుణాలు… మీరు జాయిన్ అయితే అంతే సంగ‌తి…!

హైద‌రాబాద్ హాస్ప‌ట‌ల్స్‌లో కోవిడ్ పేరుతో దారుణాలు జ‌రుగుతున్నాయి. ఎవ‌రికి అయినా క‌రోనా ఉంద‌ని వెళితే ఇష్ట‌మొచ్చిన‌ట్టు ల‌క్ష‌ల్లో బిల్లులు వేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సాక్షాత్తూ ఓ డాక్ట‌ర్‌ను ఓ ఆసుప‌త్రి ఎలా ఇబ్బంది పెట్టిందో చూశాం. దీంతో ఆ డాక్ట‌ర్ స్వ‌యంగా త‌న ఆవేద‌న‌ను వీడియో రూపంలో వ‌దిలారు. ఇక ఇప్పుడు మ‌రో హాస్ప‌ట‌ల్ చేసిన దారుణాలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈ ప‌రిస్థితి న‌గ‌రంలో అనేక హాస్ప‌ట‌ల్స్‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

 

ఓ న్యాయ‌వాది జ్వ‌రంగా ఉంద‌ని హాస్ప‌ట‌ల్‌కు వెళితే స‌ద‌రు హాస్ప‌ట‌ల్ క‌రోనా లేకుండానే నాలుగు రోజులు వైద్యం చేసి ఏకంగా రు. 3 ల‌క్ష‌ల బిల్లు వేసింద‌ట‌. న‌గ‌రంలోని విజ‌య్‌న‌గ‌ర్ కాల‌నీకి చెందిన ఓ న్యాయ‌వాది త‌ల‌నొప్పి, జ్వ‌రం ల‌క్ష‌ణాల‌తో ఓ ప్రైవేటు హాస్ప‌ట‌ల్‌కు వెళ్లారు. అక్క‌డ వైద్యులు ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేయ‌డంతో పాటు ఆధార్ కార్డు తీసుకున్నారు. అయితే న‌మూనా పంపేట‌ప్పుడు ఆయ‌న ఫోన్ నెంబ‌ర్ ఇవ్వ‌కుండా హాస్ప‌ట‌ల్ ఉద్యోగి ఫోన్ నెంబ‌ర్ పెట్టారు. ఇక్క‌డే ఈ హాస్ప‌ట‌ల్ వాళ్లు డ‌బుల్ గేమ్ ఆడారు. ఆ న్యాయ‌వాది క‌రోనా రిపోర్టు ఆ ఉద్యోగి ఫోన్ నెంబ‌ర్‌కు వ‌చ్చింది.

 

స‌ద‌రు న్యాయ‌వాదిని మూడు రోజుల పాటు కోవిడ్ వార్డులో ఉంచారు. నెగిటివ్ వ‌చ్చినా క‌రోనా చికిత్స చేయిస్తున్న‌ట్టు నాట‌కం ఆడారు. చివ‌ర‌కు ఆ న్యాయ‌వాది గ‌ట్టిగా ప్ర‌శ్నించ‌డంతో రిపోర్టు ఇచ్చారు. అందులో నెగిటివ్ అని ఉంది. చివ‌ర‌కు స‌ద‌రు న్యాయ‌వాది తోటి న్యాయ‌వాదుల‌కు ఈ విష‌యం చెప్ప‌డంతో వాళ్లంతా ఒత్తిడి చేయ‌డంతో ఆయ‌న్ను డిశ్చార్జ్ చేశారు. అయితే నాలుగు రోజుల‌కు రు. 3 ల‌క్ష‌ల బిల్లు చెల్లించాకే వారు డిశ్చార్జ్ చేశారు. ఈ హాస్ప‌ట‌ల్ తీరుపై ఆయ‌న పంజగుట్ట పోలీసులకు ఆస్పత్రి తీరుపై ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ ప్రారంభించారు. దీనిని బ‌ట్టి హైద‌రాబాద్ ప్రైవేటు హాస్ప‌ట‌ల్స్ ఎంత దారుణాల‌కు తెగ‌బ‌డుతున్నాయో అర్థం చేసుకోవ‌చ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news