సుశాంత్ సింగ్‌ది ఆత్మ‌హ‌త్య కాదా… హ‌త్యా… షాకింగ్ వీడియో

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య యావ‌త్ దేశాన్ని క‌దిలించింది. సుశాంత్ మృతిపై దేశ‌వ్యాప్తంగా కొద్ది రోజులుగా ఎవ‌రికి వారు ర‌క‌ర‌కాలుగా చ‌ర్చించుకుంటున్నారు. సుశాంత్ ఆత్మ‌హ‌త్యకు బాలీవుడ్‌లో ఉన్న నెపోటిజంతో పాటు ఆయ‌న గ‌ర్ల్‌ఫ్రెండ్ రియా చ‌క్ర‌వ‌ర్తి కూడా కార‌ణ‌మ‌ని కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక సుశాంత్ తండ్రి ఫిర్యాదు చేసిన త‌ర్వాత పాట్నా పోలీసులు రియాతో పాటు ఆమె కుటుంబ స‌భ్యుల‌ను ర‌క‌ర‌కాలుగా విచారిస్తుండ‌డంతో ఆమె సుశాంత్‌ను ఎలా వాడుకుందో ర‌క‌ర‌కాలుగా వార్త‌లు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

 

ఇదిలా ఉంటే సుశాంత్ మ‌ర‌ణంపై తాజాగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్న ఓ వీడియో సుశాంత్ అభిమానుల్లో తీవ్ర ఆందోళ‌న రేపుతుండ‌గా… దీనిపై ప‌లువురిలో ఎక్క‌డా లేని సందేహాలు కూడా త‌లెత్తుతున్నాయి. ప్రముఖ డెర్మటాలజిస్ట్ డా.మీనాక్షి మిశ్రా సుశాంత్ మరణానికి కారణం ఆత్మహత్య కాదు హత్య అని చెపుతోన్న ఓ వీడియోను షేర్ చేశాడు. సుశాంత్ ముఖంతో పాటు ఇత‌ర ప్ర‌దేశాల్లో గాయాలు ఉన్న విష‌యాన్ని ఆయ‌న వివ‌రించారు. అలాగే ఓ వ్య‌క్తి ఉరి వేసుకున్న‌ప్పుడు బాధితుడి శ‌రీరం ఎలా మార్పుల‌కు గుర‌వుతుందో ? అని కూడా చెప్పారు.

 

ఈ వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చాక ఇప్ప‌టికే సుశాంత్ మ‌ర‌ణంపై ఉన్న అనుమానాల‌కు మ‌రింత బ‌ల‌ప‌రిచేదిగా ఉంది. ఈ వీడియోకు సుశాంత్ అభిమానులు కూడా కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు సుశాంత్ ది ఆత్మహత్యకాదు కచ్చితంగా హత్యే అంటూ సంచలనం రేపిన మాజీ కేంద్రమంత్రి సుబ్రమణియన్ స్వామి ఈ ట్వీట్ ను రీట్వీట్ చేయడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.

Leave a comment