Moviesప్రియుడు ఆత్మ‌హ‌త్య‌.. టాప్ సింగ‌ర్ ప‌రిస్థితి విష‌మం

ప్రియుడు ఆత్మ‌హ‌త్య‌.. టాప్ సింగ‌ర్ ప‌రిస్థితి విష‌మం

ఇండియన్‌ ఐడల్‌ ఫేమ్, గాయని‌ రేణు నగర్‌(26) ఆస్పత్రి పాలయ్యారు. ఆమె ప్రియుడు సూసైడ్ చేసుకున్నాడ‌న్న విష‌యం తెలియ‌డంతో రేణు ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించింది. దీంతో ఆమెను హుటాహుటీన అల్వార్‌లోని ఓ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆమె ప‌రిస్థితి  కూడా విష‌మించ‌డంతో ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. ఇక దేశంలోనే టాప్ సింగ‌ర్‌గా రేణుకు మంచి పేరుంది. ఆమె ఇండియ‌న్ ఐడల్ సీజ‌న్ 10తో పాటు కొన్ని వ్యాపార ప్ర‌క‌ట‌న‌ల్లో కూడా న‌టిస్తున్నారు.

అయితే రుణు  కొద్ది రోజులుగా రవిశంకర్‌ అనే వివాహితుడితో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నారు. వీరు జూన్‌లోనే ఇంటి నుంచి పారిపోవ‌డంతో రేణు తండ్రి పోలీసుల‌కు కూడా ఫిర్యాదు చేయ‌గా పోలీసులు వీరిని తిరిగి తీసుకువ‌చ్చారు. దీంతో బుధ‌వారం ర‌విశంక‌ర్ విషం తాగి ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించాడు. చికిత్స పొందుతూ అతడు మృతిచెందాడు. ప్రియుడు ఆత్మహత్య విష‌యం తెలియ‌డంతో రేణు ఆరోగ్యం క్షీణించింది.

దీంతో పోలీసులు ర‌విశంక‌ర్ ఆత్మ‌హ‌త్య‌పై విచార‌ణ చేస్తున్నారు. అత‌డికి గ‌తంలోనే పెళ్ల‌య్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రేణు ఇంట్లో సంగీత విద్య నేర్చుకోవడానికి వచ్చి ఆమెతో ప్రేమలో పడినట్లు సమాచారం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news