Moviesవైల్డ్ డాగ్ ఫ‌స్ట్ లుక్‌లోనే నాగ్ అరాచ‌కం... అంచ‌నాలు పెంచేశాడు

వైల్డ్ డాగ్ ఫ‌స్ట్ లుక్‌లోనే నాగ్ అరాచ‌కం… అంచ‌నాలు పెంచేశాడు

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ రోజు ఆయ‌న అభిమానుల‌కే కాకుండా, టాలీవుడ్ అభిమానుల‌కు స‌ర్‌ఫ్రైజ్ ఇచ్చేశాడు. ఆయ‌న న‌టిస్తోన్న తాజా సినిమా వైల్డ్ డాగ్ ఫ‌స్ట్ లుక్ వ‌దిలారు. ఓ వైపు సోష‌ల్ మీడియాలో నాగార్జున ఫ్యాన్స్ ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు చెపుతూ దుమ్ము రేపుతున్నారు. మ‌రోవైపు చిత్ర యూనిట్ నాగార్జున‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు చెపుతూ ఆయ‌న తాజా చిత్రం వైల్డ్ డాగ్ ఫ‌స్ట్ లుక్ వ‌దిలారు. ఈ ఫ‌స్ట్ లుక్‌తోనే నాగార్జున సినిమాపై అంచ‌నాలు పెంచేశాడు. యాక్ష‌న్ నేప‌థ్యంలో ఉన్న లుక్ అరాచ‌కంగానే ఉంది.

అహిసార్ సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున ఒక ఎన్ ఐ జెడ్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. అందుకు త‌గిన‌ట్టుగానే ఫ‌స్ట్ లుక్‌తోనే ఈ సినిమాపై ఆస‌క్తి నెల‌కొంది. స‌స్పెన్స్‌, థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఇప్ప‌టికే 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కొన్ని నిజ‌జీవిత సంఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్కుతోంది. ఏదేమైనా ఫ‌స్ట్ లుక్‌తోనే నాగ్ దుమ్మురేపాడు. సీనియ‌ర్ హీరోయిన్‌ దియా మీర్జా ఫీమేల్ లీడ్ లో నటిస్తుండగా మ్యాట్నీ ఎంట‌ర్టైన్‌మెంట్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news