Gossipsతెలుగు బిగ్‌బాస్‌లోకి హాట్ యాంక‌ర్ ఎంట్రీ

తెలుగు బిగ్‌బాస్‌లోకి హాట్ యాంక‌ర్ ఎంట్రీ

తెలుగు బుల్లితెర రియాల్టీ షో బిగ్‌బాస్ నాలుగో సీజ‌న్ ఈ నెలాఖ‌రు నుంచి ప్రారంభం కానుంది. మూడో సీజ‌న్‌కు హోస్ట్‌గా ఉన్న నాగార్జునే ఈ షోకు సైతం హోస్ట్‌గా ఉంటోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్ల‌ను అంద‌రిని క్వారంటైన్‌కు పంపేశారు. ఇక వీరంతా ఈ నెల చివ‌ర్లో ఒక్క‌సారిగా డైరెక్టుగా హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌డ‌మే మిగిలి ఉంది. ఈ షోలో ఐదారుగురు టాప్ మ‌హిళా సెల‌బ్రిటీలు కూడా ఉండ‌నున్నారు. ఈ పేర్లు లీక్ కాకుండా స్టార్ మా యాజ‌మాన్యం ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది.

Ariyana Glory in Bigg Boss 4 Telugu - tollywood

తాజా అప్‌డేట్ ప్ర‌కారం మై విలేజ్ షో ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న గంగ‌వ్వ కూడా బిగ్‌బాస్ షోలో వెళ్ల‌నుంద‌ని వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక డిజిట‌ల్ ప్లాట్ ఫామ్స్‌మీద‌, టిక్ టాక్‌ల ద్వారా కూడా పాపుల‌ర్ అయిన వారు ఈ సారి షోలో ఉండ‌నున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే ఓ హాట్ యాంక‌ర్ సైతం ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నుంద‌ని తెలుస్తోంది. జెమినీ కామెడీ ఛానెల్‌తో పాపుల‌ర్ అయిన యాంక‌ర్ అరియానా గ్లోరీ ఈ సారి బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వ‌నుంద‌ట‌.

 

ఆమె వేసే పంచ్ డైలాగులు తెలుగు ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంటాయి. ర‌ష్మీ, అన‌సూయలా హాట్ యాంక‌ర్ ఇమేజ్ కోసం తెగ ట్రై చేస్తూ ఉంటోంది. ఫొటో షూట్‌ల‌తో రెచ్చ‌గొడుతూ సోష‌ల్ మీడియాలో మంచి పాపులార్టీ సంపాదించుకున్న ఆమెకు బిగ్ బాస్ క్రేజ్ మ‌రింత ప్ల‌స్ కానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news