Gossipsప్ర‌భాస్‌పై అనుష్క ప్రేమ చెక్కు చెద‌ర‌దా... ఇంత‌క‌న్నా సాక్ష్యం ఏం కావాలి..!

ప్ర‌భాస్‌పై అనుష్క ప్రేమ చెక్కు చెద‌ర‌దా… ఇంత‌క‌న్నా సాక్ష్యం ఏం కావాలి..!

యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ రాధే శ్యామ్ సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత నాగ్ అశ్విన్ తెర‌కెక్కించే సైన్స్ ఫిక్ష‌న్ ప్రాజెక్టు చేయ‌నున్నారు. ఆ త‌ర్వాత ఇతిహాస‌ యుద్ధ క‌థ ఆథారంగా తెర‌కెక్కే ఆదిపురుష్ సినిమాలో న‌టించ‌నున్నాడు. ఓం రౌత్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తోన్న సంగ‌తి విదిత‌మే. ఇక లేటెస్ట్ టాక్ ప్ర‌కారం ఇతిహ‌సాల‌కు చెందిన‌ యుద్ధ క‌థ కావడంతో ఈ సినిమాలో అనుష్క కూడా ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతోంద‌ట‌. ఇందుకు కార‌ణం బాహుబ‌లి, రుద్ర‌మ‌దేవి సినిమాల్లో ఆమె అల‌వోక‌గా న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది.

Prabhas on his link-up with Anushka Shetty: 'We haven't been seen ...

ఇప్పుడు ఈ ఇతిహాస క‌థ‌లో ఆమెకు నిర్మాత‌లు ఓ రోల్ ఆఫ‌ర్ చేశార‌ట‌. అయితే అది ప్ర‌భాస్ ప‌క్క‌న రోలా ? కాదా ? అన్న‌ది తెలియ‌దు కాని… ఈ సినిమాలో అనుష్క రోల్‌కు మంచి ప్రాధాన్య‌త ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల కాలంలో అనుష్క సినిమాలు ఒప్పుకోవ‌డం లేదు.. కానీ మ‌హాభార‌త్ కోసం ఆమెను సంప్ర‌దించిన వెంట‌నే ఓకే చెప్పింద‌ని టాలీవుడ్‌లో వినిపిస్తోన్న మాట‌. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ప్ర‌కారం ఆమెను సీత పాత్ర‌తో పాటు మ‌రో పాత్ర కోసం కూడా ప‌రిశీలిస్త‌న్నార‌ట‌.

 

దీనిపై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది. ప్ర‌భాస్‌తో ఇప్ప‌టికే అనుష్క మిర్చి, బాహుబ‌లి సినిమాల్లో న‌టించింది. ఇక ఇప్పుడు ఆమె ఆదిపురుష్‌లో కూడా జోడీ క‌డితే వీరు మూడో సారి జోడీ క‌ట్టిన‌ట్ల‌వుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news