స్పైడర్ సినిమాను టచ్ చేయలేకపోయిన సాహో

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సాహో ఇటీవల రిలీజ్ అయిన విషయం తెలిసిందే. బాహుబలి తరువాత ప్రభాస్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై అదేస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాకు తొలిరోజు మిక్సిడ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద నెమ్మదిగా తన సత్తా చాటుతోంది. కాగా ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఓ సినిమాను టచ్ చేయలేకపోయింది సాహో సినిమా.

ఇంతకీ మహేష్ నటించిన ఏ సూపర్ హిట్ సినిమాను సాహో టచ్ చేయలేదని ఆలోచిస్తున్నారా.. అది మరే ఇతర సినిమా కాదు.. బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డ స్పైడర్ చిత్రం. తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్‌కు ముందు ఎలాంటి క్రేజ్ సాధించిందో తెలిసిందే. కానీ రిలీజ్ రోజే ఈ సినిమా పెద్ద జెండు బామ్ అని తేలిపోయింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. కాగా సాహో ఈ సినిమా కలెక్షన్లను టచ్ చేయలేక పోయిందని అంటున్నారు మహేష్ ఫ్యాన్స్. వారు చెబుతున్న లెక్కల ప్రకారం.. తమిళనాట స్పైడర్ తొలి రోజు రూ.40 కోట్ల సాధించగా.. సాహో చిత్రం కేవలం రూ.36 కోట్లు కలెక్ట్ చేసిందట.

ఇలా తమ హీరో సినిమా ఫెయిల్ అయినా కలెక్షన్ల పరంగా దుమ్ములేపిందని మహేష్ ఫ్యాన్స్ కాలరెగరేస్తున్నారు. అటు ప్రభాస్ ఫ్యాన్స్ ఈ లెక్కల విషయం ఏమిటో తేల్చాలని రెడీ అవుతున్నారు.

Leave a comment