ఓ బేబీ దెబ్బకు వెనకడుగు వేసిన సమంత

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో దూసుకుపోతుంది. అక్కినేని నాగచైతన్యతో పెళ్లి తరువాత అమ్మడి సక్సెస్ రేటు మరింత పెరిగిపోయింది. దీంతో అమ్మడు చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధిస్తుంది. కాగా ఇటీవల లేడీ ఓరియెంటెడ్ మూవీగా సమంత నటించిన ఓ బేబీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మూవీగా నిలిచింది. ఈ సినిమాపై సమంత ఓ రేంజ్‌లో అంచనాలు పెట్టుకుంది. కానీ ప్రేక్షకులను అలరించడంలో సినిమా సమంత అంచనాలను తలకిందులు చేసింది. దీంతో తన నెక్ట్స్ మూవీ విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తోంది. కాగా సమంత ఓ బయోపిక్ చిత్రంలో నటిస్తోందనే వార్తలు వినిపించగా.. తాను ఎలాంటి బయోపిక్ చిత్రం చేయట్లేదని సమంత క్లారిటీ ఇచ్చింది.

దీంతో పివి సింధు బయోపిక్‌లో సమంత నటించడం లేదని తేలిపోయింది. కాగా ఆమె ప్రస్తుతం తన ఫోకస్ పూర్తిగా 96 తెలుగు రీమేక్‌ చిత్రంపై పెట్టినట్లు తెలుస్తోంది. మంచి కథాకథనం దొరికే వరకు తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను కన్ఫమ్ చేయనంటోంది సమంత. మరి ఆమె 96 తెలుగు రీమేక్‌ తరువాత ఎలాంటి సినిమా చేస్తుందా అని ఆమె ఫ్యాన్స్‌ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Leave a comment