చీప్ స్టార్‌తో మైలేజీ పెంచిన RX100 దర్శకుడు

ఒక్క సినిమాతో ఇండస్ట్రీలో చాలా మంది తమ ప్రతిభను కనబరుస్తుంటారు. ఇలాంటి వారిలో తెలుగు దర్శకుడు అజయ్ భూపతి కూడా ఒకరు. కల్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన RX100 సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడు ఈ డైరెక్టర్. చిన్న సినిమాగా తెరకెక్కిన RX100 ట్రెండ్ సెట్టర్ మూవీగా నిలవడంతో దర్శకుడు అజయ్ భూపతికి కూడా మంచి గుర్తింపు వచ్చింది. దీంతో తన నెక్ట్స్ మూవీని స్టార్ హీరోలతో ప్లా్న్ చేశాడు ఈ దర్శకుడు.

అయితే తాజాగా ఈ దర్శకుడు చేసిన ఓ ట్వీట్ ఇండస్ట్రీని కుదుపేస్తుంది. ‘చీప్ స్టార్’ అంటూ అజయ్ చేసిన ట్వీట్ ఏ స్టార్ గురించా అని తలలు పట్టుకున్నారు సినీ జనం. తమ హీరోను అంటున్నాడా..? అంటే ఎందుకు అంటున్నాడు.. అంటూ హీరోల అభిమానులు కూడా టెన్షన్‌కు గురవుతున్నారు. అయితే అజయ్ చేసిన ఈ ఒక్క ట్వీట్ ఇప్పుడు టాలీవుడ్‌ను కుదిపేస్తుంది. ఇక ఈ ట్వీట్ మాత్రం అజయ్ భూపతికి ఎదురైన చేదు అనుభవం కారణంగా చేసినట్లు తెలుస్తోంది.

మాస్ రాజా రవితేజ హీరోగా అజయ్ భూపతి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుండి మాస్ రాజా వాకౌట్ చేశాడు. దీంతో చిర్రెత్తిన అజయ్ భూపతి ఈ ట్వీట్ చేశాడంటూ సినీ విమర్శకులు తెలుపుతున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం అజయ్ క్లారిటీ ఇవ్వాల్సిందే అంటున్నారు సినీ జనాలు.

Leave a comment