Gossips'దొరసాని' శివాత్మికతో సుకుమార్ కుమారి 21ఎఫ్ సీక్వల్..!

‘దొరసాని’ శివాత్మికతో సుకుమార్ కుమారి 21ఎఫ్ సీక్వల్..!

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా కెవి మహేంద్ర డైరక్షన్ లో వస్తున్న సినిమా దొరసాని. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న శివాత్మిక స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. జీవిత రాజశేఖర్ ల చిన్న కూతురైన శివాత్మిక ఈ సినిమాతో తెరంగేట్రం చేస్తుంది. అయితే సినిమా టీజర్, ట్రైలర్ లో ఆమె ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేసింది. ఇక ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ కూడా ఇదే మాట చెప్పాడు.

శివాత్మిక ఈ సినిమాకు పర్ఫెక్ట్ చాయిస్ అని ఆమె యాస, ఎక్స్ ప్రెషన్స్ అన్ని బాగున్నాయని అన్నాడు. ఇక విజయ్ దేవరకొండలో ఉన్న సిన్సియర్ నెస్ అతని తమ్ముడు ఆనంద్ దేవరకొడలో కూడా కనిపించిందని అన్నారు. ముఖ్యంగా ఈవెంట్ లో శివాత్మిక మీద కాస్త ఎక్కువ అభిమానం చూపించిన సుకుమార్ వాలకం చూస్తుంటే దొరసాని మీద సుకుమార్ కన్నుపడ్డదని చెప్పొచ్చు.

సుకుమార్ తన సొంత డైరక్షన్ లో సినిమాలు చేస్తూనే మరోపక్క సుకుమార్ రైటింగ్స్ పేరుతో నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. కుమారి 21ఎఫ్ సినిమా, దర్శకుడు సినిమాలు అలా వచ్చినవే. ప్రస్తుతం కుమారి 21ఎఫ్ సీక్వల్ ప్లానింగ్ లో ఉన్నాడట. చూస్తుంటే ఆ సినిమాలో శివాత్మికను హీరోయిన్ గా పెట్టి తీసేలా ఉన్నాడు సుకుమార్. ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news