Gossipsఆసక్తి రేపుతున్న ఆర్ఆర్ఆర్ టైటిల్ పోస్టర్..!

ఆసక్తి రేపుతున్న ఆర్ఆర్ఆర్ టైటిల్ పోస్టర్..!

బాహుబలి సీరీస్ తర్వాత రాజమౌళి మల్టీస్టారర్ మూవీ తీస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, రాంచరణ్ లు నటిస్తున్నారు. 1820 నాటి పరిస్థితులకు అద్దం పట్టేలా ఈ సినిమా ఉండబోతుందని..రూ.400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నామని ఆ మద్య ఓ ప్రెస్ మీట్ లో చెప్పారు రాజమౌళి. ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ నటిస్తుంది. ఇక ఎన్టీఆర్ సరసన ఓ హాలీవుడ్ హీరోయిన్ అనుకున్నా..ఆమె వెనక్కి తగ్గింది.

ప్రస్తుతం హీరోయిన్ వేటలో ఉన్నారు. అజ‌య్ దేవ‌గ‌ణ్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. చ‌ర‌ణ్ షూటింగ్‌లో గాయ‌ప‌డ‌డం వ‌ల‌న చిత్ర షూటింగ్‌కి కొద్ది రోజులు బ్రేక్ ప‌డింది. అయితే ఈ మూవీకి సంబంధించిన యాక్ష‌న్ షెడ్యూల్‌ని హైద‌రాబాద్‌లోని కోకాపేట‌లో జ‌ర‌ప‌నున్నారు. ఆ త‌ర్వాత పూణేకి చెక్కేయ‌నుంది చిత్రబృందం. అయితే ఈ మల్టీ స్టార‌ర్ మూవీకి అన్ని భాష‌ల‌లో ఆర్ఆర్ఆర్ అనే టైటిల్ ఫిక్స్ చేయ‌గా, ఎక్స్‌ప్యాన్ష‌న్ మాత్రం మారనుంది.

అయితే ఆర్ఆర్ఆర్ మూవీ కి సంబంధించి అబ్రివేష‌న్స్ పంపించమ‌ని రాజ‌మౌళి ప్రెస్‌మీట్‌లో తెలిపిన విష‌యం తెలిసిందే. దీనికి నెటిజన్స్ నుండి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అన్ని భాష‌ల‌లో ఆర్ఆర్ఆర్‌కి సంబంధించి ప‌లు అబ్రివేష‌న్స్ పంపుతున్నారు. తాజాగా దీనికి సంబంధించి టైటిల్స్‌ని పోస్ట‌ర్ రూపంలో పొందుప‌ర‌చి రిలీజ్ చేశారు. మ‌రిన్నిఆస‌క్తిక‌ర టైటిల్స్ పంపండ‌ని కూడా కోరారు. జూలై 30,2020న ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుందని తెలిపారు చిత్ర యూనిట్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news