Newsఏజ్ ఎంతైనా పర్వాలేదు.. నాకు ఓకే అంటున్న రకుల్..!

ఏజ్ ఎంతైనా పర్వాలేదు.. నాకు ఓకే అంటున్న రకుల్..!

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ రకుల్ కు పెళ్లి వైపు గాలి మళ్లిందా.. కెరియర్ ఎలాగు అటు ఇటుగానే ఉంది కాబట్టి రకుల్ కూడా పెళ్లి మీద ఇంట్రెస్ట్ చూపిస్తుందా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అయితే రకుల్ పెళ్లి లవ్ ఆర్ అరేంజెడ్ ఎలా జరుగుతుంది అని ఆమెనే అడిగితే కచ్చితంగా ప్రేమించే పెళ్లి చేసుకోవాలని ఉందని అన్నది రకుల్. అంతేకాదు ప్రేమించే వ్యక్తి వయసుతో సంబంధం లేదని అంటుంది. అలా ఎందుకు అంటే ఈమధ్యనే దే దే ప్యార్ దే సినిమాలో నటించిన రకుల్ 50 ప్లస్ అజయ్ దేవగన్ తో ప్రేమలో పడుతుంది.

ఓ ఇంటర్వ్యూలో రియల్ లైఫ్ లో మీరు అలాంటి వ్యక్తితో ప్రేమలో పడతారా అంటే ప్రేమకు వయసుతో సంబంధం లేదని.. ఏజ్ ఎంతైనా నాకు ఓకే అంటుంది రకు. ఏజ్డ్ లేదా యంగ్ ఇది కాదు తను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు.. ఇష్టపడుతున్నాడు అన్నది ఇక్కడ కాన్సెప్ట్ అంటుంది. మంచి మనసున్న వ్యక్తి అది ఎవరైనా సరే తాను పెళ్లి చేసుకుంటా అన్నది.

మరి అమ్మడు సినిమాల్లో జరిగినట్టు నిజ జీవితంలో జరిగితే బాగుంటుందని అనుకుంటుందా లేక మరేమో కాని రకుల్ మాత్రం పెళ్లి విషయంలో కాస్త తొందర పడుతుందని అర్ధమవుతుంది. ప్రస్తుతం తెలుగులో కింగ్ నాగార్జున సరసన మన్మథుడు 2 లో నటిస్తున్న రకుల్ తమిళంలో సూర్యతో నటించిన ఎన్.జి.కే సినిమా రిలీజ్ కు సిద్ధమైంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news