Gossipsమెగా హీరోలు ఒకరిని చూసి ఒకరికి అసూయ.. చరణ్ షాకింగ్ కామెంట్స్..

మెగా హీరోలు ఒకరిని చూసి ఒకరికి అసూయ.. చరణ్ షాకింగ్ కామెంట్స్..

నిన్న జరిగిన అంతరిక్షం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగా పవర్ స్టార్ రాం చరణ్ స్పీచ్ అందరిని ఆశ్చర్యపరచింది. తమ్ముడు వరుణ్ కు బెస్ట్ విషెస్ అందించేందుకు వచ్చిన చరణ్ తన కామెంట్స్ తో మెగా ఫ్యాన్స్ కు డౌట్ రేజ్ అయ్యేలా చేశాడు. వరుణ్ తన ప్రతి సినిమా సర్ ప్రైజ్ చేస్తూనే ఉన్నాడు. అతని పాజిటివిటీ వల్ల తన దగ్గరకు మంచి మనుషులు మంచి కథలు వచ్చేలా చేస్తున్నాడని అన్నారు చరణ్. అంతేకాదు సినిమాల గ్రాఫ్ చూస్తుంటే వరుణ్ తేజ్ మీద తనకు అసూయ, జలస కలుగుతుందని కూడా అన్నాడు చరణ్.

చరణ్ అలా చెప్పడం అందరికి షాక్ ఇచ్చింది. మెగా హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేకత కోసం ట్రై చేస్తున్న వరుణ్ తేజ్ ను చూసి చరణ్ ఎందుకు అలా జలస్ ఫీల్ అవుతాడని అనుకుంటున్నారు. అయితే మెగా హీరోలు ఎవరు వరుస హిట్లు కొట్టినా చిరంజీవి వారసుడికి కాస్త కంగారు మొదలవుతుంది. ఆ క్రమంలో ఎంత బాబాయ్ తనయుడు అయినా వరుణ్ హిట్ కొడుతుంటే చరణ్ కు కాస్త షివరింగ్ వస్తుందని అంటున్నారు.

అంతరిక్షం మూవీ తెలుగు సినిమా స్థాయిని మరో లెవల్ కు తీసుకెళ్తుందని కంచె దర్శకుడు సినిమా నిర్మాతల్లో ఒకరైన క్రిష్ అన్నారు. సినిమా తప్పకుండా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని అన్నారు. వరుణ్ తేజ్ కూడా కొత్తగా ప్రయత్నించాం కచ్చితంగా మీ అందరికి నచ్చుతుందని చెప్పారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news