Gossipsఅక్కినేని సామ్రాజ్యం కుప్పకూలిందా..!

అక్కినేని సామ్రాజ్యం కుప్పకూలిందా..!

“అక్కినేని” తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర వేసిన సినీ కుటుంభం. ‘ఎన్ఆర్’ తో మొదలైన వారి సినీ ప్రస్థానం నిన్నటి అక్కినేని అఖిల్ వారకు కొనసాగుతూనే ఉంది. అయితే గత కొంత కాలంగా అక్కినేని అభిమానులకి నాగ్ కానీ చైతు కానీ ఆశించినంత సినిమాలు ఇవ్వలేదనే చెప్పాలి, సగటు సినీ అభిమాని కూడా వీరి గత సినిమాలు చూసి తీవ్ర నిరుత్సాహం చెందారు. నాగార్జున నటించిన గత రెండు సినిమాలు ‘రాజు గారి గది 2 ‘ మరియు ‘ఆఫిసర్’ ఇందుకు చక్కటి ఉదాహారణ, ముఖ్యంగా ఆఫీసర్ తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత బారి ప్లాప్ గా నిలిచింది.

ఇక నాగ చైతన్య పరిస్థితి కూడా ఏమంత బాలేదని చెప్పాలి, చైతు చివరి రెండు సినిమాలు యుద్ధం శరణం, రారండోయ్ వేడుక చూద్దాం, కూడా ఏమంత లాభాలు తెచ్చి పెట్టలేదు. రారండోయ్ వేడుక చూద్దాం ఒక మోస్తరుగా ఆడిన లాభాలు తెచ్చి పెట్టలేదు. యుద్ధం శరణం చైతు కెరీర్ లోనే పెద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది. ఇక అక్కినేని మూడో తరం వారసుడు అఖిల్ కి కూడా చెప్పుకోదగ్గ సినిమాలు ఎం లేవు. ‘అఖిల్’ సినిమాతో ఆరంగేట్రం చేసిన ఈ మన్మధుడు తొలి చిత్రం నిరాశ పరచగా, తరువాత తీసిన ‘హలో’ కూడా బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా పడింది.
తాజాగా అక్కినేని వారి కుటుంభం లోకి అడుగుపెట్టిన సమంత మాత్రం వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ‘రంగస్థలం’, ‘మహానటి’, ‘అభిమన్యుడు’ ఆమెకి వరుస విజయాలు తెచ్చిపెట్టాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news