Moviesరంగస్థలం సెన్సార్ రివ్యూ.. మెగా ఫ్యాన్స్ సీట్లలో కూర్చోరట.. చరణ్ నట...

రంగస్థలం సెన్సార్ రివ్యూ.. మెగా ఫ్యాన్స్ సీట్లలో కూర్చోరట.. చరణ్ నట విశ్వరూపం చూద్దామా..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా రంగస్థలం. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఈరోజు సెన్సార్ కార్యక్రమాలను ముగించుకుంది. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ సినిమాలో చరణ్ చిట్టిబాబుగా యాక్టింగ్ ఇరగదీశాడని అంటున్నారు. కొన్ని సీన్స్ లో మెగాస్టార్ గుర్తుకొచ్చేలా చేశాడని టాక్.చెవిటి వ్యక్తీగా చరణ్ యాక్టింగ్ చించేశాడని అంటున్నారు.

సినిమా చూసిన సెన్సార్ టీం షాక్ అయ్యారట. చాలా చోట్ల చరణ్ నటనకు క్లాప్స్ పడ్డాయని అంటున్నారు. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని అన్నారట. యు/ఏ సర్టిఫికెట్ సాధించిన ఈ సినిమా సెన్సార్ టాక్ మాత్రం సూపర్ హిట్ అనే చెబుతున్నారు. సుకుమార్ లోని మరో యాంగిల్ ఈ సినిమా చూపిస్తుందని అంటున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. మార్చి 30న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news