Gossipsకొరటాల...తెలుగు డైరెక్టర్స్‌కి దిమ్మ తిరిగేలా చేశాడు.. అందరికి షాకే!!

కొరటాల…తెలుగు డైరెక్టర్స్‌కి దిమ్మ తిరిగేలా చేశాడు.. అందరికి షాకే!!

మిర్చి సిినిమా చూసిన తెలుగు ప్రేక్షకులు కొరటాల వర్క్‌కి ఫిదా అయ్యారు. ఆ తర్వాత శ్రీమంతుడు సినిమాని విపరీతంగా ఇష్టపడి కలెక్షన్స్ వర్షం కురిపించారు. ఆ తర్వాత వచ్చిన జనతా గ్యారేజ్ సినిమాకు కూడా అందరినీ ఆశ్ఛర్యపరుస్తూ రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో చాలా రికార్డ్స్‌ని రిపేర్ చేశాడు. ఇప్పుడు కలెక్షన్స్ రికార్డ్స్‌నే కాదు….కొత్తగా రెమ్యూనరేషన్ రికార్డ్స్‌ని కూడా రిపేర్ చేస్తున్నాడు కొరటాల.

ఎస్ ఎస్ రాజమౌళి కూడా వరుస హిట్స్ కొట్టాడు కానీ కొరటాల మాత్రం ఇప్పటి వరకూ తను వర్క్ చేసిన హీరోలందరికీ కూడా కెరీర్ బెస్ట్ హిట్స్ ఇచ్చాడు. అందుకే కొరటాల రెమ్యూనరేషన్ కూడా పీక్స్‌కి వెళుతోంది. ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమా కోసం ఓవర్సీస్ రైట్స్ రాయించుకన్నాడు కొరటాల. కొరటాల, మహేష్ కాంబినేషన్‌లో వచ్చిన శ్రీమంతుడు సినిమాకు దాదాపుగా 19 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. అంటే ఇప్పుడు చేయబోయే సినిమాకు కూడా తక్కువలో తక్కువ 17 కోట్ల వరకూ ఓవర్సీస్ బిజినెస్ అవడం ఖాయం. ఇంతవరకూ తెలుగు సినిమా చరిత్రలో నాలుగో సినిమాకు ఈ రేంజ్‌లో రెమ్యూనరేషన్ తీసుకున్న డైరెక్టర్ ఇంకొకరు లేరు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news