Moviesవిజయ్ విజిల్ రివ్యూ & రేటింగ్

విజయ్ విజిల్ రివ్యూ & రేటింగ్

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం విజిల్ నేడు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాతో మరోసారి అట్లీ, విజయ్ కాంబినేషన్ వస్తుండటంతో తమిళ ఫ్యాన్స్‌ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో ఈ కాంబో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అయితే నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా వారి అంచనాలను ఎంతమేర అందుకుందో రివ్యూలో చూద్దాం.

కథ:
మైఖేల్(విజయ్) స్థానికంగా నివసించే పేదవారికి తోడుగా ఉంటాడు. ఒకరోజు మైఖేల్ స్నేహితుడు మహిళా ఫుట్‌బాల్ జట్టు కోచ్‌గా పనిచేస్తున్న సమయంలో తీవ్రంగా గాయపడతాడు. దీంతో ఆ బాధ్యతలను మైఖేల్ తీసుకుంటాడు. అయితే ఇక్కడ ట్విస్టు ఏమిటంటే.. ఆ జట్టు మహిళా క్రీడాకారులు మైఖేల్‌ను తమ కోచ్‌గా ససేమిరా అంటారు. ఇంతకీ మైఖేల్ ఎవరు..? అతడిని కోచ్‌గా ఎందుకు వద్దన్నారు…? చివరకు అతడి ఆ ప్లేయర్లను ఫైనల్ మ్యా్చ్‌ వరకు ఎలా తీసుకెళ్లి గెలిపించాడనేది సినిమా కథ.

విశ్లేషణ:
విజయ్ సినిమా అంటేనే తమిళనాట ఫుల్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇక తేరీ, మర్సల్ లాంటి సినిమాల బ్లాక్ బస్టర్ కాంబో మరోసారి రిపీట్ కావడంతో విజిల్ సినిమాపై తెలుగునాట కూడా అంతే అంచనాలు ఏర్పడ్డాయి. కాగా ఈ సినిమా ఫస్టా్ఫ్‌లో హీరో ఇంట్రోడక్షన్, అతడిని ఎలివేట్ చేసిన విధానం మాత్రం ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ అని చెప్పాలి. మైఖేల్ పాత్రలో విజయ్ యాక్టింగ్‌ను ఫ్యాన్స్ భీబత్సంగా ఎంజాయ్ చేస్తారు. ఇక హీరోయిన్ నయనతారతో విజయ్ లవ్ ట్రాక్ కాస్త రొటీన్‌గా అనిపించినా పర్వాలేదనపించింది. ఈ క్రమంలో అతడి స్నేహితుడికి గాయాలు కావడంతో ఓ మహిళా ఫుట్‌బాల్ జట్టుకు కోచ్‌గా వెళతాడు విజయ్. ఇక్కడో అదిరిపోయే ట్విస్టుతో ఇంటర్వెల్ బ్యాంగ్‌ను చూపించాడు దర్శకుడు.

ఇక సెకండాఫ్‌ మొత్తం మైఖేల్ ఎవరు.. అతడి గతం ఏమిటనే అంశాలను చూపించాడు దర్శకుడు అట్లీ. కాగా మహిళా జట్టు కోచ్‌గా విజయ్ చూపించిన పర్ఫార్మెన్స్‌ను డైరెక్టర్ బాగా ఎలివేట్ చేశాడు. వారిని అతడు మోటివేట్ చేసిన విధానం చాలా బాగుంది. అటు విలన్‌గా జాకీ ష్రాఫ్ పాత్రకు అట్లీ పూర్తి న్యాయం చేయలేదనే చెప్పాలి. ఇకపోతే ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాల్లో వచ్చే బ్యాంగ్‌లు చాలా బాగున్నాయి. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్‌లో మహిళా జట్టు విజయం సాధించిన తీరును బాగా చూపించాడు దర్శకుడు.

ఓవరాల్‌గా చూస్తే విజిల్ సినిమా విజయ్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్‌లాంటిది. కానీ సాధారణ ప్రేక్షకులకు ఓ కమర్షియల్ సినిమాలాగే తప్ప మరే ఇతర స్పెషాలిటీ ఈ సినిమాలో కనిపించదు. మొత్తానికి విజయ్-అట్లీ క్రియేట్ చేసిన క్రేజ్‌ను వారు అందుకోవడంలో కాస్త తడబడ్డారనే చెప్పాలి.

నటీనటుల పర్ఫార్మెన్స్:
విజయ్ చేసిన మూడు షేడ్‌ల పాత్రలు చాలా బాగున్నాయి. మైఖేల్ పాత్రలో మాస్ ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేసి, కోచ్‌గా ఫుట్‌బాల్ ప్లేయర్‌గా సాధారణ ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేశాడు. ఇక తండ్రి పాత్రలో విజయ్ యాక్టింగ్ బాగుంది. అటు హీరోయిన్‌గా నయనతార పాత్రకు పెద్ద ప్రాముఖ్యత లేదు. మిగతా వారు తమ పాత్రల మేర పర్వాలేదనిపించారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
అట్లీ దర్శకత్వం మరోసారి విజయ్ ఫ్యాన్స్‌ను ఇంప్రెస్ చేసింది. కానీ కామన్ ఆడియెన్స్‌ను అలరించడంలో కాస్త వెనకబడ్డాడు అట్లీ. ఒకేరకమైన ఫార్మాట్ కథలను ఎంచుకుని హీరో ఎలివేషన్‌కు చూపించే ప్రాధాన్యతను అట్లీ పక్కనబెడితే బాగుంటుందని ప్రేక్షకులు ఫీలయ్యారు. ఏఆర్ రెహమాన్ సంగీతం పెద్దగా ఆకట్టుకోకపోయినా బీజీఎం వర్క్ బాగుంది. వీఎఫ్ఎక్స్ పనులు సినిమాకు బాగా తోడయ్యాయి. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి.

చివరగా:
విజిల్ – విజయ్ ఫ్యాన్స్‌ వేస్తారు.. ఇతరులు చూస్తారు!

రేటింగ్:
3.0/5.0

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news