కొరటాల ప్రయత్నం.. శభాష్ అంటోన్న జనం

దర్శకుడు కొరటాల శివ తీసే ప్రతి సినిమాలోనూ ఏదో ఒక సోషల్ మెసేజ్ ఇస్తూ వస్తున్నాడు. అయితే ఆయన తాజాగా సోషల్ మెసేజ్ ఇచ్చింది సినిమాలో కాకుండా రియల్ లైఫ్‌లో. నీటిని కాపాడాలంటూ కొరటాల చేసిన విన్నపం అభిమానులతో పాటు జనాలను కూడా ఇంప్రెస్ చేసింది.

దర్శకుడు కొరటాల శివ ఆఫీసులో వర్షపు నీటిని వృథాగా పోనివ్వకుండా ఓ ఇంకుడు గుంతను ఏర్పాటు చేసి అందులోకి వెళ్లేలా చేసారు. దీంతో బొట్టు నీరు కూడా వృథా కానివ్వడం లేదంటూ ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. తన ఆఫీస్ సిబ్బంది ఇలాంటి ప్రయత్నం చేసి చాలా మందికి ఆదర్శంగా నిలిచారని ఆయన అభిప్రాయపడ్డాడు. కాగా కొరటాల దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

దీంతో కొరటాలను జనాలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మీరు సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలోనూ మంచి సందేశం ఇస్తున్నారని.. ఇతర దర్శకులు కూడా ఆయనను ఫాలో కావాల్సిందిగా అభిమానులు కోరారు.

Leave a comment