Moviesకుటుంబంతో సహా మహేష్ యాడ్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్

కుటుంబంతో సహా మహేష్ యాడ్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లో నటించడమే కాకుండా పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తోన్న విషయం తెలిసిందే. రెండు చేతులా సంపాదిస్తూ తనకంటూ ఇండస్ట్రీలో మార్కెట్ క్రియేట్ చేసుకున్న మహేష్ ఈసారి తన కుటుంబాన్ని సైతం ఓ యాడ్‌లో కలిపేశాడు. ఇప్పటివరకు కేవలం మహేష్ మాత్రమే యాడ్స్‌లో కనిపించేవాడు. కానీ ఈసారి తన ఫ్యామిలీ మొత్తాన్ని యాడ్‌లో చూపించాడు.

మహేష్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన్న సాయి సూర్య డెవలెపర్స్ సంస్థ ఓ యాడ్‌ను రూపొందించింది. ఇందులో మహేష్‌తో పాటు ఆయన భార్య నమ్రత, కొడుకు గౌతమ్, కూతురు సితార కూడా కనిపించడంతో ఘట్టమనేని అభిమానులు ఫుల్ ఖుషీ చేస్తున్నారు. ఈ యాడ్‌ను తాజాగా మహేష్ తన సోషల్ పేజీలో రిలీజ్ చేశాడు.

ఇలా తన సక్సెస్ వెంట తన కుటుంబం ఎలా ఉందో.. అలాగే సాయి సూర్య డెవలెపర్స్ సంస్థలో పెట్టుబడికి మీ కటుంబం కూడా వెన్నంటే ఉంటుందని ఆయన ఈ యాడ్ ద్వారా తెలిపాడు. ఏదేమైనా కొత్తదనాన్ని చూపించడంలో ఘట్టమనేని ఫ్యామిలీ తరువాతే ఎవరైనా అంటున్నారు అభిమానులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news