ఆ బయోపిక్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు పవన్ రాక..?

ప్రస్తుతం టాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా కొనసాగుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ మొదలుకొని సావిత్రి లాంటి బయోపిక్‌ల వరకు రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలకు ప్రేక్షకుల దగ్గర్నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. దీన్నే బేస్ చేసుకుని ఇప్పుడు ఓ ఆసక్తికర బయోపిక్ టాలీవుడ్‌లో తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్త చేసుకున్న ఆ బయోపిక్ మరెవరిదో కాదు.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మృతి చెందిన విద్యార్ధి నాయకుడు జార్జి రెడ్డిది.

ఆయన పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సందీప్ మాధవ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్నాడు. కాగా ఈ సినిమాను జీవన్ రెడ్డి డైరెక్ట్ చేస్తు్న్నాడు. అయితే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యారు. కాగా ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రానున్నట్లు తెలుస్తోంది. ఓయూ చేగువెరాగా పేరొందిన జార్జి రెడ్డి చిత్ర ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు ఆయన రావాలంటూ చిత్ర యూనిట్ ఆహ్వానించారు.

అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ వస్తారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కాగా ఈ సినిమాను అప్పిరెడ్డి, సిల్లీమాంక్స్, 3 లైన్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తుండగా.. సత్యదేవ్, మనోజ్ నందం మరియు చైతన్య కృష్ణ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. నవంబర్ 22న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Leave a comment