Moviesకోట్లాదిమంది అమ్మాయిల మనసు దోచుకున్న ఉదయ్ కిరణ్ లేడీ గెటప్ లో...

కోట్లాదిమంది అమ్మాయిల మనసు దోచుకున్న ఉదయ్ కిరణ్ లేడీ గెటప్ లో నటించిన ఏకైక సినిమా ఇదే.. ఎంత స్పెషల్ అంటే..?

ఉదయ్ కిరణ్ ఇండస్ట్రీలో రై రైయ్ మంటూ ఓ రేంజ్ లో తారాజువ్వల దూసుకుపోయిన స్టార్ హీరో . ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోగా మారిపోయి కోట్లాదిమంది అమ్మాయిల మనసులను దోచేసిన లవర్ బాయ్ గా ఇండస్ట్రీని షేక్ చేసిన స్టార్ హీరో . అయితే ఏ దిష్టి తగిలిందో ఏమో కానీ ఈ స్టార్ హీరో అతి చిన్న వయసులోనే సూసైడ్ చేసుకొని మరణించి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు .

ఈ స్టార్ హీరో చేసిన పనికి అప్పట్లో ఫ్యాన్స్ చాలా మండిపడ్డారు . అసలు ఉదయ్ కిరణ్ సూసైడ్ ఎందుకు చేసుకున్నాడు..? ఆయన సూసైడ్ మిస్టరీ వెనుక ఉన్న రహస్యాలు ఇప్పటికీ బయటపడలేదు . అయితే రీసెంట్గా ఉదయ్ కిరణ్ కి సంబంధించిన కొన్ని రేర్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఉదయ్ కిరణ్ కి సంబంధించిన చాలా చాలా ఫొటోస్ ని మనం సోషల్ మీడియాలో చూసాం . కానీ ఉదయ్ కిరణ్ లేడీ గెటప్ లో ఉన్న ఫొటోస్ ని మాత్రం ఫస్ట్ టైం మనం చూస్తున్నాం .

ఇంతకీ ఉదయ్ కిరణ్ లేడీ గెటప్ లో నటించిన సినిమా ఏంటా..? అనుకుంటున్నారా.. ఆ సినిమానే జోడి నెంబర్ వన్ . కొన్ని అనివార్య కారణాల చేత ఈ సినిమా రిలీజ్ కాలేకపోయింది. ఈ చిత్రానికి ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శకత్వం వహించగా.. ప్రతాని సుగుణ నిర్మించారు. ఇందులో వెన్య, శ్రీజ, కౌశల్, సుమీత్, గౌతమ్ రాజు ప్రధాన పాత్రలు పోషించారు.

ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ కొన్ని సన్నివేశాలలో లేడీ గెటప్స్ లో నటించారు. ఆ పిక్చర్స్ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు ఉదయ్ కిరణ్ అభిమానులు . ఉదయ్ కిరణ్ తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు అని .. కెరియర్ మంచి పొజిషన్లో ఉన్నప్పుడే ఆయన రాంగ్ పాత్రలను చూస్ చేసుకొని లైఫ్ ని నాశనం చేసుకున్నాడు అని ఫ్యాన్స్ ఇప్పటికి బాధపడిపోతున్నారు. ఆయన నటించిన సినిమాలు ఇప్పటికీ మనం టీవీలో చూసి ఎంజాయ్ చేస్తున్నాము అంటే దానికి ఏకైక కారణం ఆయన నటన అని చెప్పుకోక తప్పదు . ఏ లోకంలో ఉన్నాడో కానీ ఉదయ్ కిరణ్ మరణించిన సరే ఇప్పటికి ఆయన పేరుని జపిస్తున్నారు జనాలు.. కోట్లాదిమంది ఫేవరెట్ హీరోగా ఆయనే ఉన్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news